NewsPolitics

బీసీ కార్పొరేషన్ పెండింగ్ దరఖాస్తుదారులందరికీ రుణాలు ఇవ్వాలి – గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు..

జనాభాలో సగభాగం పైన ఉన్న బీసీల కు సంక్షేమ ఫలాలు అందటం లేదని బీసీ కార్పొరేషన్ పేరుకే కానీ 8 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు కుల ఫెడరేషన్లకు రుణాలు ఇవ్వడం లేదు పాలకవర్గాలు నియమించడం లేదు ఇదేనా బంగారు తెలంగాణ అని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమించింది అమరులయింది జైలు పాలు అయ్యింది బీసీలు కానీ తెలంగాణ వస్తే బీసీల బతుకులు మారుతాయి అనుకుంటే సామాజిక తెలంగాణ వస్తుందనుకుంటే దొరల తెలంగాణ వచ్చినట్టుగా ఉంది బీసీ కార్పొరేషన్ కుల ఫెడరేషన్లకు 2015-16 సంవత్సరము దరఖాస్తులు తీసుకొని 2023 వ సంవత్సరం వచ్చిన బీసీ రుణాలు ఇవ్వరా ? ఇదేనా బీసీలు అభివృద్ధి తెలంగాణ రాక ముందుకు ప్రతి సంవత్సరం బీసీ నిరుద్యోగయువతీ యువకులకు సబ్సిడీ రుణాలు ఇచ్చేవారు కానీ తెలంగాణ వచ్చినంక ఎన్నికలు వచ్చినప్పుడే బీసీల రుణాలు అంటున్నారు తప్పించి ప్రతి సంవత్సరం ఇవ్వటం లేదు.

ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన వెయ్యి కోట్లు ఎంబీసీ 1000 కోట్లు కాగితాలకే పరిమితం అవుతున్న తప్పించి ప్రజలకు ఖర్చు పెట్టింది లేదు ఉప ఎన్నికల అప్పుడు బీసీ బందు పెడతా అని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు కనీసం ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన బీసీ కులాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వక బీసీలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు బీసీలు అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకో కోపం ఉన్నట్టుంది, గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరు కూడా రుణాలు ఇచ్చి ఆదుకోవాలి పాత దరఖాస్తుదారులకు అందరికి ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ధర్నాలు చేస్తామని ప్రభుత్వం స్పందించి బీసీ రుణాలు అందరికీ ఇవ్వాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *