NewsPolitics

ఓట్లు బహుజనులవి- సీట్లు అగ్రవర్ణాల కా ఇదెక్కడి న్యాయం ?? – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

రాష్ట్రముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన 115 అసెంబ్లీ సీట్లలో బీసీలకు కేవలం 23సీట్లు ప్రకటించడం చాలా అన్యాయమని, 60శాతం ఉన్న బీసీ జనాభాకు కేవలం 20శాతం సీట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆందోళన వ్యక్తంచేశారు. ఈమేరకు మంగళవారం గుజ్జ సత్యం మాట్లాడుతూ అరశాతం, 2శాతం, 3శాతం ఉన్నవారికి 60శాతం టికెట్లు ప్రకటించడం అంటే సామాజిక న్యాయాన్ని బొందపెట్టినట్లే అంటూ విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో సగానికి పైగా బీసీలు ఉన్నారని న్యాయబద్దంగా ధర్మబద్ధంగా బీసీలకు 60శాతం అసెంబ్లీ స్థానాలు దక్కాల్సి ఉండగా కేవలం 23కే పరిమితం చేయడం బీసీలపై బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సవితి ప్రేమ మరోసారి అర్థం అయిందని గుజ్జ సత్యం ఆవేదన వ్యక్తంచేశారు. ఇట్టి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు గమనించాలని ఆయన విజ్ఞప్తిచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *