News

బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆగష్టు 8న ఛలో ఢిల్లీ

CHALLO DELHI

కేంద్ర ప్రభుత్వం బీసీల బడ్జెటు 2 లక్షల కోట్లకు కేటాయించాలని బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి డిమాండ్ చేస్తూ ఈనెల 8న చలో ఢిల్లీ కార్యక్రమం పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. మం సందర్భంగా బీసీ భవన్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘ ఉప అధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.

ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో బి సి లకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు.

అన్ని రాజకీయ పార్టీలు బి సి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు. రాజ్యాధికారంలో వాట ఇవ్వకుండా 75 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని విమర్శించారు.

ఈ మహా సభ క్రింది తీర్మానాలను ఆమోదించింది :

1. వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు TRS – కాంగ్రెస్ – BJP – లు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి.

3. పార్లమెంట్ లో బి సి బిల్లు పెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలి.

4. బి సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలి.

5. త్వరలో జరుపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలి.

6. బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలి.

7. బి.సి ల విద్య – ఉద్యోగ రిజర్వేషన్లు పై యున్న క్రిమిలేయర్ ను తొలగించాలి.

8. బి.సి లకు పారిశ్రామిక పాలసీ లో 50 శాతం కోటా ఇవ్వాలి.

9. కేంద్రం లో బి.సి లకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలి.

10. హై కోర్టు – సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో SC/ST/BC- రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి.

11. ప్రైవేటు రంగం లో SC/ST/BC లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి..

12. 2 లక్షల కోట్లతో బి సి సబ్ – ప్లాన్ ఏర్పాటు చేయాలి.

13. రాష్ట్రంలో బి సి కార్పోరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసిన 5 లక్షల 77 వేల మందికి వెంటనే రుణాలు మంజూరు చేయాలి.

14. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన 119 బి సి రెసిడెన్షియల్ పాటశాలలు వెంటనే మంజూరు చేయాలి.

15. ఇంజినీరింగ్ /మెడిసిన్ / ఫార్మసి / MBA, PG / డిగ్రీ కోర్సులు చదివే BC/EBC – విద్యార్ధులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.

ఈ కార్యక్రమానికి తెలంగాణా బిసి సంఘం అద్యక్షులు సి.రాజేందర్, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా అద్యక్షులు అంజి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, ములుగు జిల్లా అధ్యక్షుడు మురళి, బీసీ కోర్ కమిటీ మెంబెర్స్, బీసీ సీనియర్ లీడర్స్, విద్యార్థి నాయకులూ, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ జేఏసీలు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *