NewsPolitics

బీహార్లో బీసీల లెక్క తేలింది…తెలంగాణలో కులగణన ఇంకెప్పుడు? – గుజ్జ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు

బీహార్లో కుల, జనగణన విడుదల నేపథ్యంలో, తెలంగాణలో కూడా తక్షణమే కులగణన చేపట్టాలి అని కాచిగూడ లో ఏర్పాటు చేసిన బీసీ కోర్ కమిటీ అత్యవసర సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం బీసీ కులగరణ అంశాన్ని దాటవేసిన నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కులగన చేపట్టి బీసీ జనాభా 63 శాతం ఉందని తేల్చిందన్నారు. ఇదే ప్రామాణికన తీసు కుంటే రాష్ట్రంలో బీసీ జనాభా 57 శాతం పైగాఉంటుందని, అన్ని తెలిసే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను బహిర్గతం చేయడం లేదన్నారు. తమ రెడ్డి రావులు నాలుగు శాతం లోబడి ఉన్నారని విషయం తెలిస్తే వచ్చే బీసీ రాజ్యాధికార ఉద్యమం తీవ్రతరం అవుతుందని భయంతో కులగనన అంశాన్ని తొక్కి పెడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణలో కులగణన కోసం తెలంగాణ బీసీ కమిషన్ కు బాధ్యత అప్పగించి తెలంగాణలో బీసీ లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, జయరాజ్ ,బీసీ కోర్ కమిటీ మెంబెర్స్, విద్యార్థి నాయకులూ, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ జేఏసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *