CelebrityNews

పద్మశాలీలు రాజకీయ రంగంలో రాణించాలి: గుజ్జ సత్యం – బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు.

సమావేశంలో మాట్లాడుతున్న సత్యం సత్యం

విద్యా, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఎంతో గుర్తింపు పొంది ఉన్న మన జాతి రాజకీయ రంగంలో కూడా రాణించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తెలిపారు. ఆదివారం ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పున్నా గణేశ్ నేత ఆధ్వర్యంలో ఆటో నగర్ లోని హరణి వనస్థలిలో పద్మశాలి దసర మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ భారతదేశంలో ఎంతో ఉన్నతమైనది మన పద్మశాలి కులం అన్నారు. మన జాతిలో అద్భుతమైన మేధస్సుతో పాటు అన్ని శాస్త్రాల్లో ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు మన జాతి పాత్ర మహోన్నతమైనదని అన్నారు. సకల శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాం, అన్ని వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మన ఉనికిని చాతుతున్నామని తెలిపారు. కానీ జాతి ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైన రాజకీయ అధికారానికి చాలా దూరంలో ఉన్నామని అన్నారు. కారణాలు ఏమైనాప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మన పాత్ర ఎంతో అవసరం ఉందని తెలిపారు. మన కష్టనష్టాలు చెప్పుకోవడానికి సరైన ప్రతినిధులు లేరని అవేధన వ్యక్తం చేశారు. గురుదర బాధ్యత మనందరం తీసుకొని రాజకీయ చైతన్యం కొరకు రాజ్యాధికారం కొరకు మన యువతలో స్ఫూర్తి నింపాలని తద్వారా అధికారం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాలని తెలిపారు. ముఖ్యంగా పేదరికంలో ఉన్న పద్మశాలీ కుటుంబాలకు చేతనందించి ఆదుకునేందుకు అందరకు ముందుకు రావాలని, మన జాతిలో పేదరికం నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేళా ఛైర్మన్ రవితేజ, అఖిల భారత పద్మశాలి సంఘము అధ్యక్షులు కండగట్ల స్వామి, గడ్డం లక్ష్మీనారాయణ తులసీదాస్ ,సీత ఆంజనేయులు, రాపోలు సుధాకర్,బొమ్మ రఘురాం నేత, వేముల రాము నేత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *