EducationNews

దసరా సెలవులు ఖరారు చేసిన సర్కారు

రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులను ఖరారు చేశారు. వచ్చే నెల 13 నుంచి 13 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు షెడ్యూల్ ను విడు దల చేశారు. ఎస్ఏ-1 పరీక్షలు 5 నుంచి 11 వరకు జరగనున్నాయి. 8వ తరగతి మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలను నిర్వహించనున్నారు. గత ఏడాది ఎస్ఏ-1, ఎస్ఏ-2 పరీక్షలతో పాటు అంతకుముందు సంవత్సరాల్లో త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షల నిర్వహ ణలో సరి-బేసి విధానాన్ని అమలు చేశారు. ఉదయం పూట 6, 8, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తే, మధ్యాహ్నం 7, 9వ తరగ తుల విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే వారు. తద్వారా విద్యార్థులకు సీటింగ్ ఏర్పాట్లను చేయడానికి అవకాశం ఉండేది. అయితే.. తాజాగా విడుదల చేసిన ఎస్ఏ-1 పరీక్షల టైమ్ టేబుల్ ప్రకారం ఒక్క 8వ తరగతి మినహా మిగిలిన అన్ని తరగులకూ ఉదయమే పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఎస్ఏ-1 పరీక్షలు ముగిసిన తర్వాత 13 నుంచి 25 వరకు సెలవులు కొనసాగుతాయి. 26 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *