NewsPolitics

ఈ నెల 15వ తేదీన రాష్ట్రస్థాయి బీసీల విస్తృత సమావేశం – గుజ్జ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు.

బీసీ ముఖ్యమంత్రి సాధనకై, తక్షణ బిసి జనగణన ద్వారా మహిళా రిజర్వేషన్ తో పాటు, చట్టసభలలో 63% బీసీ రిజర్వేషన్ల సాధనకు, అదే నిష్పత్తిలో టికెట్లు కేటాయింపుకై, కార్యచరణకై ఈనెల 15న కాచిగూడ మున్నూరు కాపు భవన్ హాల్ నందు రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశం “బిసిల మహాసభ” ఏర్పరచడమైనది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రకటించారు.

కాచిగూడ మున్నూరు కాపు భవన్ లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ రిజర్వేషన్లు అసమతౌల్యత విధానాల కారణంగానే అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా 89 మార్కులకే కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే బీసీల కట్ ఆఫ్ మార్క్ 104 మార్కుల కొచ్చే దుస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. బీసీలు 70 శాతం పైగా ఉన్న పాలమూరు, ఇందూరు జిల్లాలకు వచ్చిన ప్రధాన మోడీ బీసీ రిజర్వేషన్లు అంశం, మహిళా రిజర్వేషన్లు బిసి సబ్ కోట అంశంపై ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘాలు నిరవధిక పోరాటాల ఫలితాలపై వచ్చిన అనుకూలతతో రాజ్యాధికారం ఆశిస్తున్న కాంగ్రెస్, బిజెపిలు తక్షణమే బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే బీసీలను ఆకర్షించగలరని ఆయన తెలిపారు. ప్రతి పదేళ్లకు ఒకసారి 1881 నుండి విధిగా జరుగుతున్న జనగణనకు 16వసారి ఆటంకం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బీసీల జనగణన డిమాండు తారాస్థాయికి వచ్చినందునే జనగణను పెండింగ్లో పెట్టి బీసీలకు, మహిళలకు అన్యాయం చేస్తూ 2శాతం ఉన్న అగ్రకులాలకు 10 శాతం అవకాశం ఇచ్చే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రశ్నార్థకం కావద్దనే దూరాలోచనతోనే ఈ పని చేశారని ఆయన ఆరోపించారు. బిసి ప్రధానిగా ముఖం చూపిస్తూ అగ్రకులాల ఏజెండాను కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి బీసీ వ్యతిరేక ఆలోచనలతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2015 జనగణన సర్వేను ప్రకటించలేదని ఆయన తెలిపారు. ఇటువంటి అన్యాయాలను ఎండగట్టడానికి గ్రామస్థాయి వరకు ఉద్యమ నిర్మాణానికై, భవిష్యటు కార్యాచరణకై ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అన్నిమండలాలు, 33 జిల్లా కార్యవర్గాలు, బీసీ కుల సంఘాలు, అనుబంధ సంఘాలు అన్నిటితో సమాలోచన చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, పి. సుధాకర్, ఎన్. శ్రీనివాస్ యాదవ్, నందగోపాల్, కృష్ణుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ ,వేముల రామకృష్ణ, బాల్ రాజ్ యాదవ్, సత్తయ్య కురుమ, బట్టు మురలి జగన్ ముదిరాజ్, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *