NewsPolitics

బాపూజీ స్పూర్తితో రాజ్యాధికారాన్ని బహుజనులకు చేరువచేద్దాం – గుజ్జ సత్యం

కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవ కమిటీ -చైర్మన్ గుజ్జ సత్యం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది .. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీల ప్రముఖులు , ఉద్యమకారులు , బాపూజీ అనుయాయులు , అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.. తెలంగాణా రాష్ట్రంలో పరిపాలన బాపూజీ ఆశయాలకు విరుద్ధంగా కొనసాగుతుందని పలువురు విచారం వ్యక్తం చేశారు.

తదనంతరం జయంతి వేడుక చైర్మన్ గుజ్జ సత్యం ఈ క్రింది ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు .. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రాధమిక పాఠ్యాంశంగా చేర్చాలన్నారు.. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న సిద్దించేలా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలన్నారు . తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున నామకరణ చేయాలన్నారు .కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీల నాయకులు , ఉద్యమ ప్రముఖులంతా మూకుమ్మడిగా ప్రతిపాదనలను అంగీకరించి తీర్మానాలు చేశారు..

కార్యక్రమానికి విచ్చేసిన MP ఆర్ క్రిష్నయ్య మాట్లాడుతూ సబ్బండ వర్గాలు సౌఖ్యంగా జీవించడానికి తన స్వగృహమైన జలదృశ్యాన్ని తెరాస పార్టీ ఆవిర్భావానికి అంకితమివ్వడం బాపూజీ దార్శనికతను, ధైర్యాన్ని ప్రతిభింభిస్తున్నదని కానీ నేడు తెలంగాణ ఆవిర్భావం తరువాత సామాజిక పరిస్థితులు అందుకు భిన్నంగా కొనసాగుతున్నాయని మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా అణచివేయబడుతున్నాయని పేర్కొన్నారు .

విద్య వైద్యం సామాజిక ఆర్ధిక రాజకీయ అవకాశాలు ప్రజలందరికీ సమాన నిష్పత్తిలో లభించినప్పుడే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందన్న బాపూజీ అంతరంగాన్ని ప్రభుత్వం గుర్తెరగాలన్నారు.

బాపూజీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు .. తెలంగాణ సమాజం మత్తులో తూలుతూ పసిపిల్లలు సహితం అత్యాచారం గావింప బడుతుంటే ముఖ్యమంత్రి నోరు విప్పకపోవడం, మత్తు పదార్థాల మూలలను తుదముట్టించకపోవడం, బాధిత కుటుంబాన్ని పరామర్శించకవడం ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చెప్పకనే చెబుతున్నాయని పేర్కొన్నారు..

భూమికోసం కొనసాగిన సాయుధ రైతాంగ పోరాటమే స్ఫూర్తిగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో నేడు పేదల భూమి రైతుబందు అంటూ తిగిరి దొరల చేతికి తిరిగి వెళ్తున్నది . నియామకాలు లేక తెలంగాణ యువత అల్లాడుతూ మద్యపానానికి , మత్తు పదార్థాలకు బానిసలవుతుంటే దొరల కుటుంబాలకు మాత్రం నిండుకుండలా కొలువులుఅందుతున్నాయన్నారు ..ఇటువంటి తరుణంలో  తెలంగాణ పౌరసమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ  జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు .

ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ , ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచెర్ల నాగేశ్వరరావు , పగిల సతీష్ ,వంగరి రమణ మోహన్. రిపబ్లికన్ పార్టీ, వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు, ముప్పిడి సత్యనారాయణ, జయరాజ్ , పద్మశాలి ప్రముఖులు ,బీసీ కోర్ కమిటీ మెంబెర్స్, బీసీ సీనియర్ లీడర్స్, విద్యార్థి నాయకులూ, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ జేఏసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *