NewsPoliticsViral

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

పద్మశాలీల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో సహకరించిన మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పద్మశాలీల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటివరకు ఉన్న కార్పొరేషన్లు కేవలం చేనేత ఆధారంగా ఉన్న పద్మశాలి మరియు చేనేత కుటుంబాలకి మాత్రమే అందుబాటులో ఉండగా పద్మశాలి జనాభాలో అత్యధిక శాతం వృత్తి వెలువల ఉన్న వారి సంక్షేమం అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవలసిందిగా గత ప్రభుత్వాలను ఎన్నోసార్లు అభ్యర్థించామని కొత్త ప్రభుత్వం వృత్తి వెలుపల ఉన్న పద్మశాలీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కొరకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది పద్మశాలీలకు ఒక భరోసాగా పని చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. పద్మశాలి కార్పొరేషన్ కు 1000 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తూ ప్రతి సంవత్సరం 200 కోట్ల గ్రాంట్ ను ఏర్పాటు చేయాలన్నారు .పద్మశాలి కార్పొరేషన్ పద్మశాలి కుల బంధువులకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ పద్మశాలి సమాజంలో అత్యంత వెనుకబడిన వారికి ఇండ్లు, చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి సబ్సిడీ లోన్లు, ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ఉద్యోగ సాధనకై నైపుణ్యాల శిక్షణ కల్పిస్తూ పద్మశాలి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *