News

వెయ్యి కోట్లతో పద్మశాలి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలి..నేతన్న విగ్రహం ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ కు గుజ్జ సత్యం వినతి

పద్మశాలిల అభివృద్ధికి వెయ్యి కోట్లతో పద్మశాలి డెవలపర్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, తెలంగాణ చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జ సత్యం చేనేత, జౌళి శాఖ, పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖమున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కెటిఆర్ శనివారం పోచంపల్లిలో నేతన్న విగ్రహం ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్బంగా విజ్ఞప్తి చేసినట్లు శనివారం హైదరాబాద్ లో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన రాష్ట్ర ఆవిష్కరణ సమయంలో 400 పైచిలుకు చేనేత సహకార సంఘాలు ఉండగా నేడు 6 ఏళ్ల తరువాత కేవలం 160 నుండి 170 సంఘాలు మాత్రమే వృత్తి కొనసాగిస్తూ అంపశయ్యపై విలవిల లాడుతున్నాయన్నారు. సహకార సంఘాల ఎన్నికలు జరిపించి ఆ వ్యవస్థని పునరుత్తేజం చేయించాలన్నారు. పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం, అలాగే పద్మశాలీలు అన్ని రంగాల్లో ఎదుగుటకు రూ.200 కోట్ల గ్రాంటును నైపుణ్యాల శిక్షణ అందజేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఉపాధి కోసం అప్పు, ఆర్థిక సాయం అందజేయాలని అన్నారు.

చేనేత కార్మికులకు, పద్మ శాలి యువకులకు ఉపాధికల్పనకు ఓన్ యువర్ ఆటో, ఓన్ యువర్ క్యాబ్, ఓన్యువర్ లారీ, బస్, ఓన్ యువర్ లూమ్స్, ఓన్ యువర్ హౌజ్, స్కీములు, హౌజింగ్ కాలనీల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఉన్నత విద్యకు ఇంటర్ నుంచి పిజి దాక, స్కాలర్ షిప్పులు, ఓవర్ సీస్ స్కాలర్ షిప్ విదేశీ విద్యకు చేయూత ఇవ్వాలన్నారు. వంద కోట్ల వరకు కాంట్రాక్టులు మోటివేషన్ అడ్వాన్సులు ఇవ్వాలన్నారు. బిల్డర్లుగా ఎదగడానికి చేయూత ఇచ్చి, ప్రతి మండలం, పట్టణాలలో చేనేత, చేతివృత్తి, మహిళా సంఘాల వారం వారీ అంగల్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ఉద్యోగ సాధనకై నైపుణ్యాల శిక్షణ అందజేయాలన్నారు. రాజకీయ నైపుణ్యాల శిక్షణ, భారత రాజ్యాంగం పట్ల సాధికారికత, లీడర్ షిప్, వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇప్పించాలని వినతి పత్రంలో మంత్రిని కోరినట్లు గుజ్జ సత్యం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *