NewsPolitics

బీసీ అభ్యర్థులను గెలిపించండి – గుజ్జ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీలందరూ బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. ఆయన కాచిగూడలో విలేకరులతో మాట్లాడుతూ… ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్లు జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించకుండా మోసం చేశాయన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండు మూడు శాతం ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలను విస్మరిస్తున్నారని జెండా మోసిన వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా జెండాను తాకట్టు పెట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని, రాజకీయ సిద్ధాంతాలకు, తిలోదాకాలు ఇచ్చి ,డబ్బులు ఉన్నవారికి పిచ్చి పట్టినట్లు టికెట్లు అమ్ముకుంటున్నారని అన్నారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వ కుండా కేవలం బీసీలను ఓట్ల కోసం వాడుకునే పార్టీల పట్ల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినంత మాత్రాన సరిపోదని, జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వే షన్లు కల్పించాలన్నారు. బీసీలను విస్మరించిన పార్టీలకు ఈ ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్, జయరాజ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *