NewsPolitics

సామాజిక తెలంగాణ సాధనే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే ఘననివాళి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం

కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులర్పిస్తున్న సత్యం

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నిఖార్సయిన తెలంగాణ వాది, స్వాతంత్ర సమరయోధులు, శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం , జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాలు సౌఖ్యంగా జీవించడానికి తన స్వగృహమైన జలదృశ్యాన్ని తెరాస పార్టీ ఆవిర్భావానికి అంకితమివ్వడం బాపూజీ దార్శనికతను, ధైర్యాన్ని ప్రతిభింభిస్తున్నదని కానీ నేడు తెలంగాణ ఆవిర్భావం తరువాత సామాజిక పరిస్థితులు అందుకు భిన్నంగా కొనసాగుతున్నాయని మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా అణచివేయబడుతున్నాయని పేర్కొన్నారు .

విద్య వైద్యం సామాజిక ఆర్ధిక రాజకీయ అవకాశాలు ప్రజలందరికీ సమాన నిష్పత్తిలో లభించినప్పుడే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందన్న బాపూజీ అంతరంగాన్ని ప్రభుత్వం గుర్తెరగాలన్నారు.

భూమికోసం కొనసాగిన సాయుధ రైతాంగ పోరాటమే స్ఫూర్తిగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో నేడు పేదల భూమి రైతుబందు అంటూ తిగిరి దొరల చేతికి తిరిగి వెళ్తున్నది . నియామకాలు లేక తెలంగాణ యువత అల్లాడుతూ మద్యపానానికి , మత్తు పదార్థాలకు బానిసలవుతుంటే దొరల కుటుంబాలకు మాత్రం నిండుకుండలా కొలువులు అందుతున్నాయన్నారు .ఇటువంటి తరుణంలో  తెలంగాణ పౌరసమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ  జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు .

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, పలువురు పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *