NewsPoliticsTrendyViral

మహిళా బిల్లులో ‌బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి.. గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం

పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని, బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. మహిళలకు విస్తృత అవకాశాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ప్రత్యేక సమావేశాల్లో సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని గుజ్జ సత్యం కోరారు. ‌ ఇండియా కూటమి, ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోదం తెలపడానికి కదలిరావాలనిన్నారు.

అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే జరుగుతోందని గుజ్జ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు.మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *