NewsPolitics

సమగ్ర కులగణన చట్టాన్ని తీసుకు రావాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

సమగ్ర కులగణన చట్టాన్ని తీసుకు రావాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలుపడం హర్షనీయమని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తెలిపారు.. ఆదివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రభు త్వం ప్రవేశపెట్టిన తీర్మానం అస్పష్టంగా ఉందని తీర్మానం కాకుండా దీనికి జ్యూడిషల్ కమిషన్ లేదా ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ ప్రజానీకానికి మరింత ఉపయోగంగా ఉండేదన్నారు.. తెలంగాణలో ప్రభుత్వం మారినా నేటికీ బీసీలపై అవకాశాలపరంగా వివక్ష కొనసాగుతూనే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులు దక్కగా కాంగ్రెస్ పాలనలో నేడు కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే బీసీల చేతుల్లో ఉన్నాయన్నారు. బీసీలకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తామన్న కులగణకుకు చట్టబద్ధత లేకపోవడంవలన ప్రజాధనం నిష్ప్రయోజనమయ్యే అవకాశముందన్నారు. అసెంబ్లీ తీర్మానం కంటే సమగ్ర కులగణనను చట్టం చేయడం మరింత మెరుగైన విధానం అని గుజ్జ సత్యం తెలిపారు. బీసీ సంక్షేమ పథకాలకు కావాల్సిన 20 వేల కోట్లకు గాను కేవలం 8000 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమానికి కేటాయించడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు.

ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *