NewsPolitics

ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణన్న అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం….

సమగ్ర శిక్ష, కేజీబీవీ, యుఆర్ఎస్ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణకై పాఠశాల విద్యా కమిషనర్ వద్ద శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్యను అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. 4 దశబ్ధాల ఉద్యమ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా శ్రీ ఆర్. కృష్ణయ్య ను అరెస్ట్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుడైనప్పటికి స్పీకర్ అనుమతి లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయటం వినాశకాల చర్యగా తెలిపారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు..

సమగ్ర శిక్ష, కేజీబీవీ, యుఆర్ఎస్ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని పెద్ద సంఖ్యలో ఉద్యోగులు శాంతియుత నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆర్ కృష్ణయ్య గారిని మరియు వేలాదిమంది సమగ్ర శిక్ష , కేజీబీవీ, యు ఆర్ ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులను అరెస్ట్

నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. .

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు నందు జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్ మరియు పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఐఈఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్స్, మేస్పెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, కేజీబీవి మరియు యుఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, సిఆర్టీలు, పీఈటి, ఎఎన్ఎం, అకౌంటెంట్, కంప్యూటర్ టీచర్లు, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, వంటమనుషులు, వాచ్మెన్లు, అటెండర్లు మరియు డిపిఓ స్థాయిలో ఎపిఓ, సిస్టమ్ ఎనలిస్ట్, డిఎల్ఎమ్ఎ, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ పర్సన్, ఆఫీస్ సబార్డినేటర్స్ గా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం( మినిమమ్) టైమ్ స్కేల్ను అమలుచేస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేసి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు.

డిమాండ్లు :

1. సమగ్ర శిక్షా, కెజిబివి యుఆర్ఎస్ ను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.

2. సుప్రీకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికి మినిమమ్ టైమ్ స్కేలును (కనీస వేతనం) అమలు చేయాలి.

3. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి.

4. గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.

5. నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి (హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలి.

6. విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేయిటేజ్ కల్పించాలి.

7మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

8. భవిష్య నిధి (పీఎఫ్) సౌకర్యం కల్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *