NewsPolitics

బీసీ డిక్లరేషన్ అమలుకు చర్యలు చేపట్టాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

బీసీ డిక్లరేషన్ అమలుకు చర్యలు చేపట్టాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వీలైనంత త్వరగా అమలు చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ అమల్లోకి రావడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం కూడా అభినందనీయమని అన్నారు.

బీసీ సబ్ ప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హెూదాతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా కాంగ్రెస్ పార్టీ పాలన ముందుకు సాగితే బీసీలు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిందని.. ఇవి ఇచ్చి బీసీల బాగు కోసం కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని.. బీసీల నమ్మకాన్ని చూరగొనాలంటే అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *