NewsPolitics

పార్లమెంట్ లో బి.సి బిల్లు పెట్టాలని జులై 25 న చల్లో ఢిల్లీ – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

కేంద్రం బీసీల పట్ల చిన్నచూపు అవలంభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పిళ్లా నివాస్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ముఖ్యఆ తిధిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ బీసీ సమస్యల పరిష్కరానికై జూలై 25న నేలాది మందితో చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

బీసీలంటే భారతమాత బిడ్డలని, కేంద్ర ప్రభుత్వం బీసీల జోలికి వస్తే ఖబర్దార్ అని సూచించారు. కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 యేండ్లు దాటిన బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సమాజిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరడంలేదని, బీసీలకురావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్రం అణిచివేస్తుందన్నారు. కేంద్రం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని, క్రిమిలేయర్ను రద్దుచేయాలని, బీసీలు బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని సూచించారు.

ఈ కార్యక్రమంలో లాలకృష్ణ, నీల వెంకటేశ్, సి.రాజేందర్, ఆనంతయ్య, సురేశ్, కిరణ్, సతీశ్, కృష్ణ, కె. నర్సింహగౌడ్, శ్రీనివాస్, నాగేశ్వర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *