News

ములుగు జిల్లాలో ఘనంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం..

ఈరోజు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షుడు

ఎర్రం సత్యనారాయణ ,

జాతీయ ఉప అధ్యక్షుడు గుజ్జ సత్యం,

రాష్ట్ర ఉపాధ్యక్షుడు,చౌటుపల్లి, సురేష్,

హైదరాబాద్ గ్రేటర్ అధ్యక్షుడు పండరీనాథ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ,బుట్టి శ్యామ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డిపల్లి రఘుపతి ములుగు జిల్లాకు చేరుకొని ముందుగా గట్టమ్మకు పూలమాలను వేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం

15 కార్లు 20 మోటార్ సైకిల్ గట్టమ్మ నుంచి ర్యాలీగా బయలుదేరి కార్యాలయానికి చేరుకొని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ములుగుజిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అధ్యక్షతన 200 మంది బీసీ నాయకులతో కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎర్రం సత్యనారాయణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ములుగు జిల్లాలో బీసీలంతా కలసికట్టుగా ఉద్యమం చేయాలని రాజ్యాధికారం కోసం పోరాడాలని కేంద్ర ప్రభుత్వంలో బీసీ బిల్లు ప్రకటించేంతవరకు ఉద్యమం చేయాలని బీసీల బడ్జెటు 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించేంతవరకు బీసీల ఉద్యమం ఆగకూడదని ఆయన అన్నారు

అనంతరం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం నూతన బీసీ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ మొదటిసారిగా ములుగు జిల్లాలో బీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఈ యొక్క ములుగు జిల్లాలో ఉన్నటువంటి బిసి కులాలందరూ ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఆయన సభని ఉద్దేశించి మాట్లాడుతూ

బి.సిలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం బీసీల బడ్జెటు 2 లక్షల కోట్లకు కేటాయించాలని బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేస్తూ ఈనెల 8న చలో ఢిల్లీ కార్యక్రమం. చేపట్టామని ఢిల్లీ పార్లమెంట్ వద్ద భారీ, ప్రదర్శన జరపాలని ములుగు జిల్లా నుండి బీసీ నాయకులు సుమారు 200 మందికి పైగా ఢిల్లీ కదిలి రావాలని ఢిల్లీ జంతర్ మంతర్ ప్రదేశంలో ఆర్ కృష్ణయ్య గారితో జరిగే ధర్నాలో పాల్గొని బీసీల గళం విప్పాలని ఢిల్లీలో మనం ఏందో చూపించాలని మేమెంతో మాకంతా దక్కాలని ఆర్ కృష్ణయ్య గారితో మనం కూడా ఉద్యమం చేద్దామని ములుగు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ బీసీ భవన్ లో

మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికలలో బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు.అన్ని రాజకీయ పార్టీలు బిసి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు. రాజ్యాధికారంలో వాటఇవ్వకుండా 75 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని సమావేశంలో అన్నారు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు TRS – కాంగ్రెస్ – BJP – లు బి.సి.లకు

50 శాతం టికెట్లు ఇవ్వాల నీపార్లమెంట్ లో బి సి బిల్లు పెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని

బి.సి.ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలి

త్వరలో జరగబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాల నీ డిమాండ్ చేశారు బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలి. 7. బి.సి.ల విద్య- ఉద్యోగ రిజర్వేషన్లు పై యున్న క్రిమిలేయర్ ను తొలగించాలి బి.సి లకు పారిశ్రామిక పాలసీ లో 50 శాతం కోటా ఇవ్వాలి.. ములుగు సంక్షేమ భవన్లో డిమాండ్ చేశారు.

కేంద్రం లో బి.సి లకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని

హై కోర్టు – సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో SC/ST/BC రిజర్వేషన్లు ప్రవేశపెట్టి . ప్రైవేటు రంగం లో SC/ST/BC లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు 2 లక్షల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి

రాష్ట్రంలో బి సి కార్పోరేషన్ కు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసిన 5 లక్షల 77 వేల మందికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన 119 బి సి రెసిడెన్షియల్ పాటశాలలు వెంటనే మంజూరు చేయాలి.

ఇంజినీరింగ్ /మెడిసిన్ / ఫార్మసీ / MBA, PG/ డిగ్రీ కోర్సులు చదవే BC/EBC విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మంచెర్ల నాగేశ్వరరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు ఆళ్ల రాణి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు విజయ్, ములుగు మండల అధ్యక్షుడు గుండాలపు వైకుంఠం, 9 మండలాల అధ్యక్షులు మహిళా అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అన్ని మండలాల సీనియర్ బీసీ నాయకులు పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరు ములుగు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *