NewsPolitics

పద్మశాలీలు రాజకీయంగా ముందుకు రావాలి :MP ఆర్. కృష్ణయ్య.

బిసి జనాబాలో సమిచిత స్తానం కలిగి ఉన్న పద్మశాలీలు రాజకీయంగా ముందుకు రావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు . బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం నేతృత్వంలో పి హెచ్ టి షాపింగ్ మాల్ పార్టనర్స్ మరియు వివిధ పద్మశాలి సంఘాలకు చెందిన నేతలు బిసి భవన్ లో ఆర్. కృష్ణయ్యను కలిసి భవిషత్ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పద్మశాలీయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం వహిస్తున్నాయని అన్నారు. చేనేత కార్మికులకు చేనేతబంధు పథ కాన్ని అమలు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్న ఎక్స్రేషియాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని కోరారు. వీటితో పాటు ఇల్లు లేని ప్రతి నిరుపేద చేనేత కుటుంబానికి డబుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలని, నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ తరహాలో చేనేత ఉత్పత్తులకు ప్రభుత్వమే షోరూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా వస్త్రాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత సహ కార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహిం చాలని .పోచం పల్లి ఇక్కత్ డిజైన్లు ప్రింటింగ్ చేస్తూ డుప్లికేట్ వస్త్రా లను తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసు కోవాలని పేర్కొన్నారు. అందుకు పద్మశాలీలు లందరూ ఏకత్రాటిపైకి వచ్చిరాజకీయ పార్టీలపై వత్తిడి తేవాలన్నారు.కృష్ణయ్య ను కలిసిన వారిలో పద్మశాలి సంఘం భువనగిరి జిల్లా అధ్యక్షులు తీరందాసు ధనుంజయ,పోచం పల్లి మాజీ సర్పంచ్ గడ్డం వెంకటేశం,ఎస్బీఐ రిటైర్డ్ ఏజిఎం వనం నరసింహ, కొండల రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *