News

బీసీల హక్కులు సాధించే వరకు దేశవ్యాప్త ఉద్యమాలు – గుజ్జ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు

బీసీల హక్కులను సాధించే వరకు దేశంలో ఉన్న బీసీలందరూ ఒకే తాటిపై ఉంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీయా లని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం పిలుపునిచ్చారు. శనివారం కాచిగూ డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్రం చేపట్టే జన గణనలో కుల గణన చేయాలని, అసెంబ్లీలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయకపోతే.. కేంద్రంపై త్వరలో బీసీల తిరుగుబాటు తప్పదనిజనగణలో కులగణన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణ య్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి త్వరలో లక్షలాది మందితో దేశవ్యాప్తం గా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురేష్ మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, జయరాజ్ , ప్రవీణ్ ,బీసీ కోర్ కమిటీ మెంబెర్స్, బీసీ సీనియర్ లీడర్స్, విద్యార్థి నాయకులూ, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ జేఏసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *