NewsPolitics

పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు సగం స్థానాలు ఇవ్వాల్సిందే – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు సగం స్థానాలు ఇవ్వాల్సిందే – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బిసి సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

ప్రస్తుతం జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారం సగం పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇవ్వాలని ఆయన కోరారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇన్ని అన్ని టికెట్లు ఇస్తాం అన్ని చెప్పి మోసం చేశారని ఈ ఎన్నికల్లోనైనా బీసీలకు 9 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ఆయా రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు బీసీలకు కావాల్సింది రాయితీలు కాదని రాజ్యాధికారంలో వాటా కావాలని రాజ్యాధికారం బీసీలకు సాధించినప్పుడే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. మూడు పార్టీలు సగం పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు బీసీలు ఓట్లు వేస్తారని లేకుంటే తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *