News

బిసి కులాలకు రూ.1 లక్ష సాయం కొంతమందికేనా? గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు

హైదరాబాద్, జూన్ 09 : బీసీ కులవృత్తులవాళ్లకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అప్లయ్ చేసుకునేందుకు ఎవరైనా మీ సేవ సెంటర్ వెళ్లే అక్కడి సిబ్బంది బీసీల్లోని కొన్ని కులాలకే స్కీమ్ వస్తుందని బదులిస్తున్నారని, బీసీల్లోని అందరికీ దీన్ని వర్తింపజే స్తుందా? అనేదానిపై క్లారిటీ ఇవ్వడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దరఖాస్తులకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే దారుణం అన్నారు. అప్లికేషన్లు మొదలుపెట్టినా దీనిపై కన్ఫ్యూ జన్ కొనసాగుతూనే ఉందన్నారు. మొదట ఇచ్చిన జీవోలో ‘ఆల్ ద బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఆర్టిజన్స్, వొకేషనల్ కమ్యూనిటీస్’ అని పేర్కొన్నప భుత్వం, ఆ తర్వాత విడుదల చేసిన మెమోలో మాత్రం ప్రత్యేకంగా 14 కులాలు, ఎంబీసీలు అర్హులని ప్రస్తావించిందన్నారు. అయితే, ఈ స్కీములో లబ్దిదారులకు సర్కారు మెలికలు పెట్టిందన్నారు. గత ఐదేండ్లలో ఎవరైనా రూ.50 వేలకు పైబడిన ప్రభుత్వ సంక్షేమ పథ కాలను తీసుకుని ఉంటే అనర్హులని జీవోలో పేర్కొందన్నారు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో కలెక్టర్లు పలు సందేహాలు వ్యక్తం చేయగా అదే రోజు ఓ మెమోను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసిందన్నారు. అందులో లబ్ధిదారులుగా కేవలం కొన్ని కులాలనే మెన్షన్ చేయడం మరింత సందేహాలకు తావిస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులూ పథకానికి అర్హులేనని మెమోలో పేర్కొన్నారని, అయితే రైతుబంధు, గొర్ల స్కీముల్లో లబ్దిపొందిన వాళ్లకు దీన్ని ఇస్తరా? ఇవ్వరా? అన్నది మెన్షన్ చేయలేదన్నారు. ఇదిలా ఉంటే కండిషన్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. దళితబంధు పథకానికి దళితుల్లో ఎవరైనా అర్హులేనని అప్పట్లో స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నోళ్లూ అప్లై చేసుకోవచ్చని క్లియర్గా చెప్పారని, బీసీలకు రూ.1 లక్ష సాయానికి మాత్రం ఇన్ కమ్ సర్టిఫికెట్ తప్పనిసరని, రూ.50 వేలకు పైబడిన ఇతర పథకాలు తీసుకున్నోళ్లు అర్హులు కారని పేర్కొనడం విమర్శలకు తావిస్తున్నదన్నారు.

నాయీ బ్రాహ్మణులు, రజకులు, సగర, ఉప్పర, కుమ్మరి/శాలివాహన, అవుసల, కంసాలి, కమ్మరి, కంచారి, వడ్ల/వడ్ర/వడ్రంగి/శిల్పి, కృష్ణ బలిజ/ పూసల, మేదర, వడ్డెర, ఆరెకటిక, మేర, ఎంబీసీ వంటి కులాలవాళ్లు అర్హులవుతారని మెమోలో ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొందని, బీసీల్లోని ముఖ్యంగా 14 కులాలతో పాటు ఎంబీసీని అందులో మెన్షన్ చేసిందన్నారు. పద్మశాలి, గౌడ, యాదవ, కురుమ, గొల్ల, ముదిరాజ్, మున్నూ రుకాపు, వాల్మీకిబోయ, తదితర కులాల ప్రస్తావనే మెమోలోలేదన్నారు. వీళ్లకు వర్తింపజేస్తరా లేదా అనేది చెప్ప లేదన్నారు. వీళ్లలో ఎవరైనా అప్లై చేసుకునేందుకు మీ సేవా సెంటర్లకు వెళ్తే… కొన్ని కులాలకు మాత్రమే అవకాశం ఉందంటూ అక్కడివాళ్లు చెప్తున్నారన్నారు. మొదట విడుదల చేసిన జీవోలోనేమో ‘ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టిసన్స్, వొకేషనల్ కమ్యూనిటీస్’కు లబ్ది కలుగుతుందని పేర్కొన్నటికీ… తెల్లారి ఇచ్చిన మెమోలో ‘ఆల్ ద బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఆర్టిజన్స్, వొకేషనల్ కమ్యూనిటీస్’కు అని చెప్తూనే కొన్ని కులాలను విడిగా ప్రస్తావించడంపై సందేహాలు వ్యతం అవుతున్నాయన్నారు. మున్సిపల్ ఆఫీసులో కాపీ ఇవ్వాలట… ఆన్లైన్లోనే పారదర్శకంగా దరఖాస్తులను తీసు కుంటామని సర్కారు అప్లికేషన్లను ఈ నెల 6న ప్రకటించిందని కానీ, అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఆ ఫారాన్ని సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపాలిటీల్లో సబ్మిట్ చేయాలని చెప్తున్నారని తెలిపారు.

మరోవైపు తొలిరోజు అప్లికేషన్ల స్వీకరణ సజావుగానే సాగినా.. ఆ తర్వాతి రోజు నుంచి మొ రాయించడం మొదలు పెట్టిందన్నారు. దరఖాస్తు నింపేంత వరకు అంతా సజావుగానే సాగినా.. చివర్లో సబ్మిట్ చేశాక దాన్ని తీసుకోవడం లేదన్నారు. గంట సేపటిదాకా వేచి చూసినా ప్రయోజనం ఉండడం లేదన్నారు. ఈ నెల 20(కేవలం రెండు వారాల వరకే గడువు విధించడం.. ఇంత తక్కువ గడువులోనూ రెండు రోజులు సర్వర్ సతాయించి అప్లికేషన్లు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రెండు రోజులుగా సర్వర్ మొరాయిస్తున్నా.. సర్వర్ సమస్యను మాత్రం ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *