NewsPolitics

బీసీల డిమాండ్లు నెరవేర్చే పార్టీలకే బీసీల ఓటు – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

ఈరోజు జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ కన్వీనర్ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ

76 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో మొదటిసారి ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల ప్రధాన డిమాండ్లైన సమగ్ర కుల గణనను చట్టం మరియు రిజర్వేషన్లు పెంపు వంటి వాటిల్లో స్పష్టమైన విధివిధానాల వల్ల ప్రకటించిన ప్రకటించారు.

రాహుల్ గాంధీ గారు చాలాసార్లు కూడా బీసీలకు సంబంధించిన డిమాండ్ల పైన మాట్లాడుతూ భారతదేశంలో కులగణన ద్వారా మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని దానికోసం సమగ్ర కులగరణ చేయడం ద్వారా తద్వారా వచ్చిన డేటా ఆధారంగా ఏ వర్గానికి ఎంత వాటా ఎవరిక వాటా ఎంత అన్నదాన్ని లెక్కలోకి తీసుకొని ఆ ప్రకారమే రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం కూడా ఉందని చాలాసార్లు చెప్పారు.

గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కులగణనను చేయబోమని సుప్రీంకోర్టు సాక్షిగా స్పష్టంగా తెలియజేసింది. రిజర్వేషన్ల విషయంలో కూడా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని బీసీ సోదరులందరూ కూడా గమనించాలి.

బిజెపి స్పష్టమైన బీసీ వ్యతిరేక విధాలను ఓపెన్ అవలంబిస్తున్న కారణంగా అదే సమయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ బీసీల డిమాండ్లను అన్ని అంగీకరించిన విషయాన్ని గమనించాలి మనం ఆలోచించి మన ఓటు వినియోగించుకోవాల్సిందిగా బీసీలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *