News

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ⁃ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

హైదరాబాద్, మే 23 : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని తమ బినామీ కంపెనీలకు అమ్ముతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం తొమ్మిదేళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

జర్నలిస్టుల పోరాటానికి ఎల్లపుడు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. గత ఎన్నికలల్లో జర్నలిస్టులకు ఇళ్లు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్లతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించితే మీడియాపై ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *