News

ఒక్కో బీసీ పైన తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం పెట్టిన ఖర్చు సంవత్సరానికి మూడు రూపాయలా ??? గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు ,జాతీయ బిసి సంక్షేమ సంఘం…

ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తులకు ప్రతి కుటుంబాన్ని ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించారు. సంతోషం కానీ ఈ ఒక లక్ష రూపాయలు గతంలో 2018 ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామని ప్రకటించి 5లక్షల 77వేల మంది వద్ద దరఖాస్తులు తీసుకున్నారు. ఒక్కరికి ఒక లక్ష నుంచి 20 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ 5 సంవత్సరాలు గడిచిన ఒకరికి కూడా రుణం ఇవ్వలేదు. నిజంగా చెత్తశుద్ధి ఉంటే దరఖాస్తుదారులకు ముఖ్యమంత్రి ప్రకటించిన లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇవి ఇలాగే పెండింగ్ లో ఉంచి కొత్త దరఖాస్తులు తీసుకుంటే ప్రజలు నమ్మరని అన్నారు.

బీసీ కార్పొరేషన్, MBC కార్పొరేషన్ 12 బీసీ కులాల ఫెడరేషన్లకు, చైర్మన్లను పాలక మండళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటివరకు అనేక బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. వీటి మార్చుకోవాలని కోరారు. స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించారు.

కేంద్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడంతో రుణాలు నిలిచిపోయాయి.

గతంలో ఒక సంవత్సరం 10 నెలల క్రితం ముఖ్యమంత్రి బిసిలకు బి.సి బందు పధకం పెట్టి 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దానికి అతి – గతి లేదు. “బీసీ బందు” పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *