News

అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ ప్రకటించాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ ప్రకటించా లనిబిసిల దామాషా ప్రకారం జిల్లాలను యునిట్లుగా చేసుకుని సీట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బిఎస్పి పార్టీ 70 సీట్లు బిసిలకు కేటాయిస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నమని, బిసి ముఖ్యమంత్రి పదవి కూడా బిసిలకే కట్టబెట్టాలని కోరారువచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయిం చాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 15 శాతం దాటలేదన్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లకు బీసీలు కేవలం 21 మంది మాత్రమే ఉన్నారని, మెజారిటీ జిల్లాల్లో ఒక బీసీ ఎమ్మెల్యే లేడన్నారురాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాల నుంచి ఒక్క బీసీ శాసనసభ్యులు లేడని అన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా బీసీలను పట్టించుకునే దిక్కులేదన్నారు. బీసీ జాబితాలో 130 కులాలుంటే 115 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గేట్ దాటకపోవడం అన్ని రాజకీయ పార్టీలకు సిగ్గు చేటని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప బీసీలకు అన్ని రంగాలలో ప్రజాస్వామిక వాటా ఇవ్వడంలేదన్నారు.

బిజెపి పార్టీ ఇటీవల ఒక బీసీ చేసిన డిక్లరేషన్లో కేంద్రానికి సంబంధించిన ఒక్క డిమాండ్ లేదన్నారుఈ దేశంలో గత 75 సం వత్సరాలు పాలించిన కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదన్నారు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజి క రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదన్నా రు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56శాతం జనాభా గల బిసిలకు రాజకీయ రంగం లో 14 శాతం, ఉద్యోగ రంగంలో 5 శాతం, పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిధ్యం లేదంటే బిసిలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలి సిన ఆవశ్యకతను తెలుపుతుందన్నారు. స్వాతంత్రం వచ్చిన ప్పుడు బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్ లలో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారన్నారుత్వరలో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీల జనాభాను కులాల వారిగా సేకరిస్తున్నారనిబీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారుచట్టపరమైనన్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవన్నారుపులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారన్నారు.

ఈ వైఖరి మార్చుకోకపోతే బీనీలు తిరగబడతారని హెచ్చరించారుసుప్రీం కోర్టు, హైకోర్టు బిసి జనాభా లెక్కలు సేకరించాలని 40 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆదేశిస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం బిసి జనాభా లెక్కలు తీయకుండా అన్యాయం చేస్తుందని విమర్శించారుకేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారుఅలాగే అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ చేయాలని డిమాండ్ చేశారులేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *