Viral

100 C.C కంటే త‌క్కువ కెపాసిటీ ఉన్న బైక్ ల‌పై ఒక్క‌రు మాత్ర‌మే ప్ర‌యాణించాలి : హై కోర్ట్ తీర్పు.!!

మ‌న దేశంలో జ‌నాల‌ను ఇబ్బందులు పెట్ట‌డం ప్ర‌భుత్వాల‌కు అల‌వాటేగా. ఎప్పుడూ ఏదో ఒక దిక్కుమాలిన రూల్‌ను తెచ్చి జ‌నాల‌ను అవ‌స్థ‌ల‌కు గురి చేస్తుంటాయి. వాటితో ఏం ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలియ‌దు కానీ, జ‌నాల‌కు మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూడా తాజాగా ఇలాంటి ఓ రూల్‌ను అమ‌లులోకి తెచ్చింది. అదేమిటంటే… ఇక‌పై అక్క‌డ 100 సీసీ అంత‌కు త‌క్కువ కెపాసిటీ ఉన్న బైక్‌ల‌పై వెనుక సీట్‌లో రెండో వ్య‌క్తి ప్ర‌యాణించ‌డానికి వీలు లేదు. అలాంటి బైక్‌ల‌పై కేవ‌లం ఒక్క‌రే ప్ర‌యాణం చేయాలి. ఈ రూల్‌ను ప్ర‌స్తుతం అక్క‌డ అమ‌లు చేస్తున్నారు.

మైసూర్‌లో జ‌రిగిన ఓ రోడ్డు ప్రమాదం వ‌ల్ల కొంద‌రు అక్క‌డ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో పిల్‌ను విచారించిన క‌ర్ణాట‌క రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్ర‌కారం ఇక‌పై ఆ రాష్ట్రంలో 100 సీసీ అంత‌కు త‌క్కువ కెపాసిటీ ఉన్న బైక్‌ల‌పై రెండో వ్య‌క్తి ప్ర‌యాణించ‌కూడ‌దు. నిషేధం విధించారు. అలాంటి బైక్‌ల‌పై కేవ‌లం ఒక్క‌రే ప్ర‌యాణించాలి. ఇక ఆ రాష్ట్ర ట్రాన్స్ పోర్టు అధికారులు కూడా ప్ర‌మాదాలను త‌గ్గించాలంటే కర్ణాటక మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ 1989 ప్రకారం ఈ రూల్‌ను అమ‌లు చేయాల‌ని సూచించార‌ట‌. దీంతో కోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

ఈ రూల్ ను మొద‌ట బెంగుళూరులో అమ‌లు చేస్తున్నారు. త‌రువాత ఆ రాష్ట్రంలో ఇత‌ర ప్రాంతాల్లోనూ దీన్ని అమ‌లు చేయ‌నున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న 25 శాతం మేర వాహ‌నాల‌పై కేవ‌లం ఒక్క‌రే ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త కూడా వ‌స్తున్న‌ద‌ట‌. దీంతో 100 సీసీని 50 సీసీకి త‌గ్గించాల‌నే ప్ర‌తిపాద‌న‌ల‌ను కూడా అధికారులు ప్ర‌భుత్వానికి పంపించ‌నున్నారు. మ‌రి చివ‌ర‌కు వారు ఈ రూల్‌ను ఎలా అమ‌లు చేస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ రూల్ మ‌రీ అంత ప్ర‌భావం కనిపించేలా అయితే లేదు. 100 సీసీ అంత‌కు త‌క్కువ కెపాసిటీ ఉన్న బైక్ ల‌పై ఒక్క‌రే ప్ర‌యాణిస్తే ప్ర‌మాదాలు ఎలా త‌గ్గుతాయో ఆ రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అధికారుల‌కే తెలియాలి. అలాగే ఆ బైక్‌ల‌ను కూడా టూవీల‌ర్ అంటారు క‌దా, మ‌ర‌లాంట‌ప్పుడు ఇద్ద‌రు ప్ర‌యాణించ‌కుండా ఒక్క‌రే ప్ర‌యాణిస్తే ఎలా..? అస‌లే ప్ర‌జా ర‌వాణా అస్త‌వ్య‌స్తంగా ఉండ‌డంతో చాలా మంది సొంత వాహ‌నాల్లో వెళ్తున్నారు. ఇక అలాంటి స‌మ‌యంలో ఇలాంటి రూల్స్ తెస్తే దాన్ని జ‌నాలు ఎలా స‌హిస్తారు..! ఇది క‌రెక్టేనంటారా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *