Videos

ఈ జాగ్రత్తలు పాటిస్తే సెల్ ఫోన్లు పేలకుండా ఉంటాయ్.

ఈ మద్య సెల్ ఫోన్ పేలడం చాలా వింటున్నాం ఎక్కువ గ శాంసంగ్ ఫోన్ లు మరియు mi ఫోన్ ల విషయం లో ఇలా జరిగాయి,రెడమి. ఒక్కటే కాదు ఐఫోన్ 6 , సామ్ సంగ్ ఎడ్జ్, వివో, లెనోవా, కూల్ ప్యాడ్ మొబైల్స్  కూడా కొన్ని పేలాయి.మనం మొబైల్  వాడే దాన్ని బట్టే మన ప్రాణాలు ఆధార పడిkoఉన్నాయి. మొబైల్ కంపెనీని బట్టి కాదు,సెల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు  హీట్ గా ఉంటే 5 లేదా 10 నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టండి..మొబైల్ ఛార్జింగ్ లో వున్నప్పుడు  వైఫై, హాట్ స్పాట్, పాటలు, నెట్టు, కాల్స్, గేమ్స్ అస్సలు యూజ్ చేయకండి.మొబైల్ కి వచ్చిన చార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ చార్జర్ ని కొనుక్కొని వాడండి, 100 రూ. లకు దొరికే చవక చార్జర్ లు అస్సలు వాడకూడదు      మీకు అవసరం లేని అప్లికేషన్స్ ను వెంటనే తీసేయ్యండి, కొన్ని గేములు, అప్లికేషన్లు వల్ల మీ మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది వాటిని అనిన్ స్టాల్ చెయ్యండి.మొబైల్ ఛార్జింగ్ అయిన వెంటనే వీడియో కాల్ , హెవీ గేమ్స్ అస్సలు ఆడకూడదు, ఛార్జింగ్ అయిన తర్వాత మొబైల్ హీట్ ఉంటే 5 నిమిషాల వరకు మొబైల్ ని పట్టుకోకుండా, ఫాంట్ జాబులో పెట్టుకోకుండా ఉంటే మంచిది ఎప్పుడైనా ఛార్జింగ్ 96% కంటే ఎక్కువ అవ్వనివ్వద్దు. 20% కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి.

మీ మొబైల్ పౌచ్ ఉంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టండి.   మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేదా ఎరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టడానికి అస్సలు  ప్రయత్నించండి. ఇలా చెయ్యడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. మొబైల్ హీట్ గా వున్నప్పుడు తడి చేతులతో అస్సలు పట్టుకోకూడదు.    మొబైల్ ఛార్జింగ్ లో లేనప్పుడు కూడా పేలిపొయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్ లో మొబైల్ ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఎక్కువ. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి చల్లబడ్డాక ఆన్ చెయ్యండి  ,మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరీ తీసుకొని మార్చండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *