NewsViral

పర్సనల్ లైఫ్‌లో ఇవాంకా…ఎలా ఉంటుందో తెలుసా?

పర్సనల్ లైఫ్‌లో ఇవాంకా…ఎలా ఉంటుందో తెలుసా?

ప్రపంచాన్ని లెక్కచేయని ట్రంప్‌ని…ఆమె మాత్రం ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసా? తల్లికి విడాకులిచ్చినా….తండ్రికి ఇవాంకా ఎంత సపోర్ట్ చేసిందో తెలుసా? అనఫీషియల్ ప్రెసిడెంట్ ఇవాంకా మ్యాజిక్ పై ఏబీఎన్ స్పెషల్…. చాకచక్యమైన నిర్ణయాలు….సూటిగా మాట్లాడే మనస్తత్వం….ట్రంప్ లాంటి వ్యక్తిని కంట్రోల్ చేసే సామర్థ్యం….. ఒక్కమాటలో చెప్పాలంటే అనధికార ఫస్ట్ లేడీ అనిపించుకున్న ప్రతిభ…ఏ ఘటనలు ఆమెను ఇంత నేర్పుగా తీర్చిదిద్దాయ్? ఏ పాఠాలు ఇంత సామర్థ్యాన్నిచ్చాయ్?

అమెరికా శక్తివంతమైన దేశం. ఆ దేశాన్ని నడిపించేది శక్తివంతమైన అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడిని నడిపించేది అంతకు మించి అనిపించే అత్యంత శక్తివంతమైన సలహాదారు. ఈహోదాలో స్వయానా ఆ దేశాధ్యక్షుడి కూతురే ఉందంటే… ఆమె ఎంత పవర్‌ఫుల్‌ అయి ఉండాలి. నిజమే…ఇవాంక పవర్ ఫుల్లే…కానీ ఆ పవర్‌ని కిరీటంలా తలపై ధరించడం లేదు. బాధ్యతగా భుజాలెత్తుకున్నారు. అందుకే ఆమె అనధికారిక ఫస్ట్ లేడీ..

ఈ బాధ్యతలు, ఈ హోదా కేవలం డాటరాఫ్ ట్రంప్ కావడం వల్లే వచ్చినవి కాదు. ఈ హోదాకు అవసరమైన అన్ని క్వాలిటీస్ ఇవాంక సొంతం. అన్ని ప్రత్యేకతలు ఆమెలో లేకుంటే… అప్పుడెప్పుడో విడాకులిచ్చిన మొదటి భార్య కుమార్తె… ఇప్పుడు వైట్ హౌజ్ లో చక్రం తిప్పడమేంటి?. ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంక. సాధారణంగా అమెరికన్స్‌లో తండ్రి-కూతురు మధ్య అంతగా ఎఫెక్షన్ ఉండదు. పైగా ఇప్పటికే విడిపోయిన భార్య కూతురితో రిలేషన్ అంటే అంతంత మాత్రమే. మళ్లీ పెళ్లిచేసుకోకుంటే తండ్రి ప్రేమ కూతురికే పరిమితమయ్యేదేమో. కానీ ఇవానా తర్వాత ట్రంప్…మేపుల్స్‌‌ను రెండో పెళ్లిచేసుకున్నారు. ఆమెకు విడాకులిచ్చేసి….మొలానియాను మూడో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ మొదటి భార్య కుమార్తెపై ఈ స్థాయి ఎఫెక్షన్ అంటే అదంతా ఇవాంకలో ఉండే స్పెషాలిటీస్ అనాలేమో…

డొనాల్డ్ ట్రంప్, ఇవానా 1991లోనే విడాకులు తీసుకున్నారు. అప్పటికి ఇవాంక వయసు పదేళ్ళు. ఆమెకు 15ఏళ్లు వచ్చేవరకూ మన్ హట్టన్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత కనెక్టికట్‌లోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. చోయేట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇవాంక 2004లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 14ఏళ్లప్పుడే మోడలింగ్‌లో జాయిన్ కావడం…ఆ ఏడాదిలోనే ప్రముఖ మ్యాగజైన్స్‌లో ఆమె ఫొటోలు పబ్లిష్ కావడంతో ఇవాంక పాపులర్ అయ్యారు.

డిగ్రీ పూర్తైన వెంటనే అంటే 20ఏళ్లకే ఫ్యామిలీ బిజినెస్ లో అడుగుపెట్టారు. మొదట డైమండ్ బిజినెస్, తర్వాత గోల్డ్ జ్యుయలరీ వ్యాపారం చేశారు. బట్టలతో పాటు యాక్సెసరీస్ ను రూపొందించారు. ఇవాంక పేరుతోనే షూస్, జ్యుయలరీతో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్‌ను మార్కెట్లోకి వచ్చాయ్. 2015 లోనే వంద మిలియన్ డాలర్లను బిజినెస్‌లో సంపాదించిందంటే ఆమె కలెక్షన్స్‌కు అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. చైనాలో కూడా ఇవాంక కలెక్షన్స్‌కు కాసుల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆమె బిజినెస్ చైనాలో విజయవంతంగా నడుస్తోంది.

ఒక్క ఫ్యాషన్ రంగంలోనే కాదు తండ్రి డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన అనేక వ్యాపారాలను ఆమె నిర్వహించారు. లిక్కర్ బిజినెస్‌తో పాటు గోల్ఫ్స్ క్లబ్స్, రిసార్ట్స్, హోటల్స్ లాంటి బిజినెస్‌లను ఇవాంక నడిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వ్యాపారాల నుంచి డొనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్ళు ఇవాంకే ఈ బాధ్యతలన్నీ భుజానికెత్తుకున్నారు. ఆ తర్వాత వైట్ హౌస్‌లో అడ్వైజర్‌గా జాయిన్ అయ్యారు ఇవాంక ట్రంప్. అంతమాత్రాన తండ్రికే ఫుల్ సపోర్ట్ అనుకుంటే పొరపాటే….ఎందుకంటే ట్రంప్ తన కుమార్తె ఆదేశాలను పాటిస్తారేమో కానీ… ఇవాంక —ట్రంప్‌ని గుడ్డిగా సమర్థించరు. ఆ విషయం ఎన్నికల ప్రచారంలోనే స్పష్టమైంది.

 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇవాంక..తండ్రి తరఫున ప్రచారం చేసినప్పటికీ…ఆమె తన అభిప్రాయాలను ఏమాత్రం దాపరికం లేకుండా వెల్లడించడం ట్రంప్‌ ప్రత్యర్థుల్ని సైతం నివ్వెరపరచింది. ”ఒక పౌరురాలిగా ఆయన చేస్తున్న పనిని నేను ఇష్టపడతాను. కానీ ఒక కూతురిగా ఇది ఆయనకు కష్టమైన విషయంగా భావిస్తాను” అని ఇవాంక నిర్భయంగా చెప్పారు. మొదట్నుంచీ ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్న ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక..ఓ దశలో తన పట్టును కాస్త సడలించింది అంటే అది ఇవాంకవల్లనే. ”నా తండ్రిలో ఉన్న అత్యంత గొప్పవైన నైపుణ్యాలలో ఒకటి ఏంటంటే.. మనుషుల్లోని సామర్థ్యాలను ఇట్టే పట్టేస్తారు. అమెరికాను ఆయన మళ్లీ ఒక గొప్ప దేశంగా మార్చేయగలరు” అని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఇవాంక అన్న మాటల్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రముఖంగా ప్రచురించింది. పైగా ఇవాంక వైట్‌హౌస్‌లో ఉన్నంత వరకే అమెరికా గానీ, మిగతా దేశాలు గానీ ట్రంప్‌ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని ఆ పత్రిక భావించింది. ఈ మాటల్లో నిజానిజాలెంతున్నా….ఇప్పటికైతే అమెరికాకు షీ ఈజ్‌ ద బాస్‌….

ఇవాంకలో ఉన్న క్వాలిటీస్ అన్నీ సరే….ట్రంప్ లాంటి వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ఏ స్థాయి ప్రతిభ ఉండుండాలి. ఓ వైపు తండ్రి తప్పొప్పుల్ని ప్రశ్నిస్తూ-ప్రస్తావిస్తూ….మరోవైపు ఆ ప్రభావం తండ్రిపై పడకుండా చేయాలంటే ఎంత నేర్పుండాలి. ట్రంప్ నే హ్యాండిల్ చేస్తోన్న ఇవాంకలో ఉన్న ప్రత్యేకతలేంటి? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఆయన ప్రసంగాలు, స్టేట్ మెంట్స్ ఎప్పటి కప్పుడు ఇవాంక పర్యవేక్షిస్తారు. అందుకు అవసరమైన గణాంకాలు, ఇతర ఆధారాలు సమకూర్చి ఆ ప్రసంగాలకు మరింత జీవం పోయడంతో ఇవాంక సక్సెస్. ట్రంప్ ప్రసంగాలను రూపొందించేది ఇవాంక టీమే…

ఓ దశలో వ్యక్తిగత సలహాదారు హోదాలో కుమార్తెను నియమించుకోవడం ఏంటని….విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కుటుంబపాలను నాంది పలుకుతున్నారా అని విమర్శలు వెల్లువెత్తాయ్. కానీ డోంట్ కేర్ అని ముందుకు సాగారు ట్రంప్. ప్రత్యర్థుల నుంచి ఎన్ని విమర్శలొచ్చినా తలొగ్గలేదంటే…ఇవాంక అంటే ఏంటో…ఆమెలో టాలెంట్ ఏంటో అప్పటికే ట్రంప్‌కి తెలుసు. సాధారణంగా ట్రంప్ మనస్తత్వమే డిఫరెంట్. అసలు ట్రంప్ లాంటి వ్యక్తి అధ్యక్షుడయ్యాడంటే ఎవరైన ఆ పదవిని అలంకరించొచ్చు అన్నంత ఈజీగా మారిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడే ట్రంప్….భయం అనేదే ముఖంలో కనిపించని ట్రంప్….ఎవ్వరినీ కేర్ చేయని ట్రంప్…ఇవాంక సలహాలు సూచనలు పాటించడంలో మాత్రం మారు మాట్లాడరు. అదీ ట్రంప్‌పై ఇవాంకకు ఉన్న కమాండ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *