ఐటీ లో మేటి నీకెవ్వరూ లేరు సాటి

ఐటీ లో మేటి నీకెవ్వరూ లేరు సాటి

రోజురోజుకూ నాయకుడిగా మెరుగుపడుతూ..

తన మేధోసంపత్తిని మరింత విస్తృతం చేసుకుంటున్నారు.. మంత్రి కేటీఆర్. ఇప్పుడు.. హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా.. తనకే సాధ్యమైన రీతిలో.. ఓ అంతర్జాతీయ స్థాయి వృత్తి నిపుణుడు మాట్లాడినట్టుగా ప్రసంగించి.. అంతర్జాతీయ అతిథులతో శభాష్ అనిపించుకున్నారు.

తెలంగాణ పల్లె నుంచి మొదలు పెట్టి.. వైట్ హౌజ్ వరకూ చాలా విషయాలపై ప్రస్తావించారు. తనను తాను పరిచయం చేసుకున్న దగ్గరి నుంచి మొదలు పెట్టి.. తెలంగాణ ప్రజానీకాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను వివరించారు. మన రాష్ట్రానికే ప్రత్యేకమైన పాలసీలను ఎలుగెత్తి చాటారు.

తెలంగాణలో ఉన్న యువశక్తిని, నైపుణ్యాన్ని.. ప్రపంచం దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. టీ హబ్ లాంటి ఆసియాలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ గురించి చెబుతూ.. రానున్న రోజుల్లో ప్రపంచానికే అతి పెద్ద టెక్నాలజీ కేంద్రం నెలకొల్పబోతున్న విషయాన్ని చెప్పి.. అభినందనలు అందుకున్నారు. మాట్లాడేది ఓ రాష్ట్రానికి చెందిన మంత్రేనా.. లేక.. ఇంటర్నేషనల్ ఫేమస్ సెలెబ్రిటీనా అని ఆలోచించేలా.. తన ప్రసంగ పాఠవాన్ని రుచి చూపించారు.

చెప్పే విషయంలో క్లారిటీ.. చేసిన ప్రసంగంలో ష్యూరిటీ చూపిస్తూ.. తన మాటలకు తగిన ఆధారాలు టచ్ చేస్తూ.. ఎవరూ వేలెత్తి చూపించకుండా.. రెండు చేతులూ కలిపి చప్పట్లు కొట్టేలా.. కేటీఆర్ మాట్లాడిన తీరుతో.. రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారు. ఇలాంటి మంత్రి.. మన రాష్ట్రానికి రానున్న రోజుల్లో మరింత ఆస్తిగా మారనున్నట్టు స్పష్టం చేస్తున్నారు. కేటీఆర్ మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా ఆశీర్వదిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి  ఇవాంక ట్రంప్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ సతీమణి), డెల్ కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కారెన్ క్యుంటోస్ పాల్గొంటారు. రెండోరోజు చర్చల్లో ప్రముఖ సినీనటులు రామ్‌చరణ్‌తేజ, సోనమ్‌కపూర్, ప్రముఖ క్రీడాకారులు సానియామీర్జా, పుల్లెల గోపీచంద్, మిథాలీరాజ్, సునీల్ గవాస్కర్ తదితరులు పాల్గొంటారు. సినిమా, క్రీడా, వైద్యరంగాలపై చర్చ జరుగుతుంది. ఐటీసీ గ్రూపు హెడ్ శివకుమార్ సూరంపూడి, అంకుర్ క్యాపిటల్ కోఫౌండర్ రితూవర్మ కిర్లోస్కర్ సిస్టమ్స్ చైర్‌పర్సన్, సెలబ్రిటి చెఫ్ వికాస్‌ఖన్నా, పేపాల్ ఉపాధ్యక్షురాలు లిసా మాథుర్, ఫిప్ల్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సచిన్ బన్సల్, ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సీఈవో రుక్మిణి బెనర్జీ, ఢిల్లీ హైకోర్టు జడ్జి ప్రతిభాసింగ్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సీవోవో ప్రియాంక చోప్రా, సంజీవ్ అగర్వాల్ పాల్గొంటారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.