HealthViral

పసుపు గార పట్టిన దంతాలు తెల్లగా మారటానికి సులభమైన చిట్కాలు

పసుపు గార పట్టిన దంతాలు తెల్లగా మారటానికి సులభమైన చిట్కాలు

ఈ రోజుల్లో టీ,కాఫీ,కిళ్ళీ,గుట్కా వంటివి నమలటం ఎక్కువ అయ్యిపోయింది. దాంతో దంతాలు పచ్చగా గార పట్టటం మరియు చిగుళ్లు అనారోగ్యానికి గురి కావటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంది.. ప్రతి రోజు బ్రష్ చేసిన ఈ గార పోదు. అలాగే ఎన్ని రకాల టూట్ పేస్ట్ లను ఉపయోగించిన ఎటువంటి ఫలితం ఉండదు. పంటి మీద గారను దంత సమస్యలను సులువుగా వదిలించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పసుపు గార పట్టిన దంతాలు తెల్లగా మారటానికి ENO చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ENO లో బేకింగ్ సోడా ఎక్కువగా ఉండుట వలన దంతాలు తెల్లగా అవ్వటానికి సహాయపడుతుంది.

ఈ చిట్కా కోసం ఒక ENO పేకెట్,అర నిమ్మ చెక్క అవసరం అవుతాయి . ఒక బౌల్ లో ENO పౌడర్ వేసి దానిలో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని బ్రష్ సాయంతో పళ్ళ మీద రుద్దాలి. ఇలా రెండు నిముషాలు అయ్యాక నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే పంటి మీద పసుపు పచ్చని గార తొలగిపోతుంది. ENO నోటిలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే దంతాలను బాలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా పిప్పి పండ్ల సమస్య నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

మన వంటగదిలో సులభంగా దొరికే పదార్ధాలతో కూడా పసుపు గార పట్టిన దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. దీనికి నిమ్మరసం,ఉప్పు,పసుపు అవసరం అవుతాయి. నిమ్మకాయను సగానికి కోసి నిమ్మచెక్క మీద ఉప్పు మరియు పసుపు వేసి దంతాలను రుద్దాలి. ఈ విధంగా చేస్తే కొన్ని నిమిషాల్లోనే మంచి ఫలితం కలుగుతుంది.

టూట్ పేస్ట్ మీద ఉప్పు జల్లి బ్రష్ చేస్తే పంటి మీద గార పోవటమే కాకుండా నోటిలో బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటె పంటి మీద గార,పంటి సమస్యలు తగ్గిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *