FilmViral

బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ బ్యూటీ మిథాలీ రాజ్

బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ బ్యూటీ మిథాలీ రాజ్

మిథాలీ రాజ్. భారత మహిళా క్రికెట్ కు వన్నెలద్దిన లెజెండరీ క్రికెటర్. రీసెంట్ గా మహిళా ప్రపంచకప్ లోనూ తన జట్టును ముందుండి నడిపించిన గొప్ప ప్లేయర్. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మిథాలీరాజ్.. వివాదాలకు దూరగా ఉంటూనే వస్తోంది. ఐతే.. రీసెంట్ గా రేపిన ఓ కాంట్రవర్సీకి బదులిచ్చేందుకు మరింత తెగువ చూపించింది మిథాలీ.

ఇటీవల తన స్నేహితులతో కలిసి ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది మిథాలీ రాజ్. ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా ఉన్నానంటూ.. తన హ్యాపీనెస్ ను ఫాలోయర్స్ తో పంచుకుంది. ఐతే.. ఆమె ఫొటోకు పెట్టిన పోజు.. మిథాలీ వేసుకున్న కాస్ట్యూమ్ కాంట్రవర్సీ అయ్యాయి. నేషనల్ ఐకన్ అయినప్పుడు.. డ్రెస్ సెన్స్ ఉండదా…  కనీసం సభ్యత పాటించక్కరలేదా.. అంటూ.. నెటిజన్స్ మిథాలీని హేళన చేశారు. ఆమె ఫొటోను.. ఆమె ఆటిట్యూడ్ ను గేలి చేశారు. దీనికి మాటలతోకాకుండా… లేటెస్ట్ గా చేతలతో మిథాలీ బదులిచ్చిందని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. అందుకే తన అందాలన్నీ ఆరబోసి.. ఓ హాట్ ఫొటోషూట్ లో పాల్గొన్నట్టుగా విశ్లేషిస్తున్నారు.

మిథాలీ రాజ్ హాట్ ఫొటోషూట్ ఇపుడు ఇంటర్నెట్ , సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆటలో డేర్ ను చూపిన ఈ హైదరాబాదీ.. అందంలోనూ కెమెరాలను తనవైపు ఏనాడో తిప్పుకుంది. ఇపుడు గ్లామర్ ను కురిపించి.. మరోసారి అందరి కళ్లను తనవైపు లాగేసుకుంటోంది. స్కిన్ షో ఉందన్న ఉద్దేశంతో  అభిప్రాయాలు మార్చుకోవద్దని.. వ్యక్తిత్వం ముఖ్యమని ఇప్పటికే మిథాలీ, ఆమె సన్నిహితులు చెప్పారు. మెంటాలిటీలు మార్చుకోవాలని సూచించారు.

ఇదివరకెప్పుడు మిథాలీ ఇంత గ్లామర్ షో చేయలేదని… ఆడవాళ్లంటే అలుసుగా మాట్లాడేవాళ్లకు బదులివ్వాలనే ఇలా అందాలు బయటపెట్టి ఫొటో షూట్ లో పాల్గొన్నదని ఓ టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *