UsefulViral

రౌండ్ ఫిగర్ 100, 200, 500 తో! ఇలా పెట్రోల్ కొట్టిస్తే మీరు మోసపోయినట్లే, ఎలా మోసం చేస్తున్నారో మీరే చూడండి

రౌండ్ ఫిగర్ 100, 200, 500 తో! ఇలా పెట్రోల్ కొట్టిస్తే మీరు మోసపోయినట్లే, ఎలా మోసం చేస్తున్నారో మీరే చూడండి

మనం ప్రతిరోజు బైక్ లో గాని లేదా కార్ లోగాని పెట్రోల్ కొట్టిస్తాం అయితే సాధారంగా అందరం కూడా రౌండ్ ఫిగర్ కిట్టించం అలావాటు (వంద, రెండు వందలు, ఐదు వందలు) ఇలా కిట్టించడమే వాళ్ళు అదనుగా తీసుకొని మోసం చేస్తునారు, ఎలా చేస్తున్నారో చూద్దాము.

ఇప్పటికే తరచుగా ధరలు పెరుగుతున్న పెట్రోల్ వల్ల వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే మరోవైపు పెట్రోల్ బంకు యజమానులు కూడా మోసాలకు దిగారు. తాజాగా లక్నోలో ఓ పెట్రోల్ బంకులో టాస్క్ ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో 100 రూ.ల పెట్రోల్ కొట్టిస్తే 100ఎం.ఎల్. తక్కువగా వచ్చినట్టుగా అధికారులే ప్రత్యక్షంగా గుర్తించారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సప్లయ్స్ అధికారులు స్పందనా రాహిత్యంతో ఉండడంతో యథేచ్ఛగా మోసాలు జరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల మెషీన్లకు అత్యాధునిక చిప్ లు అమర్పి తద్వారా మన జేబులు కొడుతున్నారు. 100, 200 రూ.ల మొత్తాల్లో రోజువారీ పెట్రోల్ కొట్టించే వారు కనీసం 50ఎం.ఎల్. నుంచి 200 ఎం.ఎల్. వరకు నిత్యం కోల్పోతున్నారు. అయితే డిజిటల్ చిప్ సర్దుబాటులో జరిగే మోసాన్ని టెక్నికాలిటీస్ తో సహా వివరిస్తూ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎలా మోసం చేస్తారో కింద వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి. అంతకంటే ముందు పెట్రోల్ బంకుల్లో ఏయే రకాలుగా మనల్ని చీట్ చేస్తారో చూడండి.

మీటర్ రీడింగ్లో సర్దుబాటు:

పాతతరం యంత్రాల్లో రీడింగ్ మీటర్ ను సర్దుబాటు చేస్తారు. దీంతో తక్కువ పెట్రోల్ పోసినా రీడింగ్ ఎక్కువగా చూపిస్తుంది. ఇది పాత టెక్నిక్. వేర్వేరు బంకుల్లో పెట్రోల్ పోసుకొని మైలేజ్ ను గమనించినప్పుడే ఈ మోసం బయటపడుతుంది.

మాటల్లో పెట్టి మాయ చేయడం:

మీరు పెట్రోల్ పోసుకునే సమయంలో బంకు సిబ్బంది మిమ్మల్ని మాటల్లో దింపొచ్చు. అంతకు ముందు ఓ వ్యక్తి రూ.50 పెట్రోల్ పోసుకుంటే ఆ రీడింగ్ ను మార్చకుండానే మీకు పెట్రోల్ పోస్తారు. కొన్నిసార్లు మీరు రూ.1000 పెట్రోల్ పోయమంటే సరిగా వినపడనట్టు నటించి రూ.200 పెట్రోల్ పోస్తారు. మరోసారి చెప్పినప్పుడు మాటల్లో దింపి పాత రీడింగ్ మార్చకుండానే రూ.800 వచ్చే వరకు పెట్రోల్ పోస్తారు. అంటే రూ.200 నష్టపోయినట్టే.
పొడవైన పైపులు వాడడం:

కొన్ని పెట్రోల్ బంకుల్లో పొడవుగా ఉండే పైపులను వాడుతారు. వినియోగదారుడిని దూరంగా ఉంచి పెట్రోల్ పోస్తారు. మీటర్ రీడింగ్ పూర్తయిన వెంటనే నాజిల్ను ఆఫ్ చేస్తారు. దీంతో పైపులో ఉన్నంత మేర పెట్రోల్ మిగులుతుంది. దీనిని నివారించేందుకు వాహనాన్ని యంత్రానికి దగ్గరలో ఉంచాలి పైపులో ఉన్న పెట్రోల్ పూర్తిగా అయిపోయేవరకు నాజిల్ ఆఫ్ చేయొద్దని సిబ్బందికి చెప్పాలి.

రౌండ్ ఫిగర్:

బంకుల్లో తక్కువ పెట్రోల్ పోసినా రూ.100 – 500 – 1000 కనిపించేలా సర్దుబాటు చేస్తున్నారు. రూ.125 – 575.. ఇలాంటి సంఖ్యలతో పెట్రోల్ పోయించుకుంటే దీనిని నివారించవచ్చు. రౌండ్ ఫిగర్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఏవైనా తప్పులు గుర్తిస్తే వెంటనే బంక్ మేనేజర్ ను కలిసి వివరణ తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *