NewsPolitics

ప్రభుత్వం వెంటనే ‘బీసీ బంధు’ను ప్రకటించాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ బీసీలకు రుణాలు ఇవ్వలేదని, ప్రభుత్వం వెంటనే బీసీ బంధు’ను ప్రవేశపెట్టాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కొదండరామ్, రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, అనిల్, బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంలు డిమాండ్ చేశారు. శనివారం నారాయణగూడలో అఖిల భారత పద్మశాలిసంఘం ఆధ్వర్యంలో బీసీ బంధు.. భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లక్షల రూపాయలు ప్రకటించి మరోమారు కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇదీ ఎన్నికల స్టంట్ మాత్రమే అని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్లకు ఒక పైసా నిధులు ఇవ్వలేదన్నారు. ఎస్సీ సబ్లన్కు ఏవిధంగా పోరాటం చేశామో అదే విధంగా బీసీ సబ్ ప్లాను, బీసీ బంధుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బీసీలందరిలో చైతన్యం వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, చిలువేరు కాశీనాథ్, జక్కని సంజయ్ కుమార్, అశోక్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా అధ్యక్షులు బొమ్మ అమరేందర్, పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *