DevotionalUseful

నవంబర్ 4 2017 పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేస్తే కోటి జన్మల పుణ్యం.

నవంబర్ 4 2017 కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేసిన వారికి కోటి జన్మల పుణ్యం…

పౌర్ణమి నాడు చంద్రుడు నిండు పరిపూర్ణుడైనట్లే మన మనస్సును కూడా జ్ఞానత్వం పొందాలనేదే ఈ పౌర్ణమి ఆంతర్యం.

ఈ రోజున అనగా నవంబర్ 4rth న దీపదానం చేసిన యడల సకల విధములైనటువంటి పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది. అటులనే సాలగ్రామ దానం ఉసిరిదానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి.

సంవత్సరమంతా దీపం పెట్టని పాపము ఈ ఒక్క రోజు దీపం పెడితే కలుగుతుందని పెద్దలు చెపుతారు.

గంగ ,గోదావరి నదుల్లో దీపదానం కన్నుల పండుగగా జరుపుతారు కార్తీక పౌర్ణమిరోజు హరుడు త్రిపురాసుడిని సంహరించినట్లుగా పురాణాలు చెపుతున్నాయి.

కార్తీక పౌర్ణమి రోజున మొత్తం ఉపవాసముండి సాయంత్రాన 365 వత్తులతో దీపారాధన చేస్తారు జ్వాలాతోరణ మహొత్సవం జరుపుతారు.

ఈ జ్వాలాతోరణం చూడ్డం అత్యంత పుణ్యఫలం ఏకాదశి రుద్రాభిషేఖము లేదా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేఖం చేయిస్తే కోటిజన్మల పుణ్యఫలం పొందుతారు.

కేదారేశ్వర వ్రతం చేసుకుంటే శుభం జరుగుతుందని స్త్రీలు సౌభాగ్యం పొందటం కోసం పసుపు కుంకుమ పుష్పము ఫలము అక్షింతలతో పాటు కార్తీక పురాణం పుస్తకం దానమివ్వడం ఎంతో మంచిది దీపదానం చెయ్యాలనుకున్నవారు

పైడి పత్తితో వత్తులు వాళ్ళే తయారుచేసుకోవాలి వరిపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను తయారుచేసి అందులో వత్తిని ఉంచి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించి నమస్కరించి కార్తీక సోమవారం నాడుకాని కార్తీక పౌర్ణమినాడుకాని శైవ ,వైష్ణాలయంలో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి

దీపం వెలిగించనున్న వాళ్ళే కాదు అది ఆరిపోకుండా కాపాడిన వాళ్లకు అత్యంత పుణ్యం ఫలం లభిస్తుంది.

ఈ మాసమంతా వాకిలికి ఇరువైపులా లేదా తులసికోట దగ్గర దీపాలు వెలిగించడం మన సాంప్రదాయం.

దీపం జ్యోతిపరబ్రహ్మణే నమః
ఓం నమః శివాయ

ఖచ్చితంగా అందరికీ షేర్ చెయ్యండి
మరింత మందికి ఈ విశిష్టత తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *