HealthLifestyle

సరైన నిద్ర లేకపోతే మధుమేహం వచ్చేస్తుంది

మదుమేహం. ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువగా ఇబ్బందిపెడుతున్న అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ఎక్కువ గంటలు పని చేస్తూ నిద్ర వస్తున్నా గట్టిగా అదిమి పట్టేస్తూ నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెళకువతో వుండేవారు గుర్తించాల్సిన విషయం ఇది.
 
అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్ జీవితంలో ఇది సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందంటున్నారు. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించిన వారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
 
నిద్రలేమి వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకువెళ్ళే ప్రమాదం సైతం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు వహించండం మరవకూడదంటున్నారు వైద్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *