Health

ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ గురించి మీకు తెలుసా..?

fidget-spinner

ఆందోళన, ఒత్తిడిలను వదిలించాలంటే సంగీతం వినాలి లేదా ప్రకృతిలో విహరించాలి. ఇవీ ఒత్తిడిని చిత్తు చేయటానికి మనం అనుసరిస్తూ వస్తున్న పద్ధతులు. కానీ ఒత్తిడిని చిటికెలో తుర్రుమనిపించే ఓ సరికొత్త స్ట్రెస్‌ యాంటీడోట్‌ మార్కెట్లోకొచ్చింది. రెండు వేళ్ల మధ్య ఇమిడిపోయే ఆ బొమ్మే ‘ఫిడ్జెట్‌ స్పిన్నర్‌’. ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ అనేది వేళ్ల మధ్య ఇమిడిపోయి గుండ్రంగా తిరిగే గ్యాడ్జెట్‌. గుండ్రంగా తిరుగుతూ ఉన్న ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ను చూస్తుంటే మనసులో ఒత్తిడి మటుమాయమవతుందని. ఆహ్లాదకరమైన భావన కలుగుతోందని ప్రపంచవ్యాప్త యూజర్ల రివ్యూలు చెబుతున్నాయి. దీని గురించి యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు కూడా వచ్చేశాయి. కొందరు ఉత్సాహపరులు ఈ విడ్జెట్లను ఒత్తిడి, అటెన్షన్‌ డెఫిసిట్‌ డిజార్డర్‌ ఉన్న వాళ్లకు స్వచ్ఛందంగా పంచుతున్నారు కూడా! ఇక ఈ విడ్జెట్‌ స్పిన్నర్స్‌లో రకాలు కూడా ఉన్నాయి. రకరకాల రంగులు, సైజులు, షేపుల్లో దొరికే ఈ స్పిన్నర్స్‌లో కొన్ని వెలుగులు కూడా వెదజల్లుతాయి.

ఇటీవల రిలీజ్ అయ్యే ఒక సరికొత్త సినిమా డిజే మూవీలో అల్లు అర్జున్ ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ మీద ఒక సాంగ్ టీజర్ కూడా విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *