NewsUseful

అక్కడ కిలో జీడిపప్పు పది రూపాయలే!

అక్కడ కిలో జీడిపప్పు పది రూపాయలే!

తక్కువ రకం జీడిపప్పును కొనాలంటానే సామాన్యులకు సాధ్యం కాదు. ఎందుకంటే దీని ధర కూడా వందల్లో ఉంటుంది. అలాంటిది ఏ గ్రేడ్ రకం మార్కెట్‌లో కిలోకు రూ.1,000 నుంచి రూ.1,200 పలుకుతుంది. అయితే ఇంత ఖరీదైన జీడిపప్పు కిలో కేవలం రూ. 10 నుంచి 20 రూపాయలకే లభిస్తే జనం క్యూలో నిలబడరూ. ఓ ప్రాంతంలో మాత్రం కిలో జీడిపప్పు రూ.10 నుంచి రూ.20లకు లభిస్తుంది. దీనిని మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఆలూ, ఉల్లి కంటే ఇక్కడ అత్యంత చవకగా జీడిపప్పు దొరుకుతుంది. అదే ఝార్ఖండ్‌లోని జమతారా జిల్లాలో అత్యంత తక్కువ ధరకు లభ్యమవుతుంది. జమతారాలో 49 ఎకరాల్లో జీడి తోటలున్నాయి. ఈ తోటల్లో పనిచేసే మహిళలు, పిల్లలు అత్యంత తక్కువ ధరకే జీడిపప్పును అమ్మేస్తుంటారు. జీడిపప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అందుకే ఈ మార్గంలో ప్రయాణించే వారు ఆగి మరీ జీడిపప్పును కొంటారు. కొన్నాళ్ల కిందట జమతాడా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన కృపాయనంద‌ ఝా కృషి ఫలితంగా ఇక్కడ జీడి తోటలు సాగులోకి వచ్చినట్లు స్థానికులు పేర్కొంటారు. ఆయన కలిగించిన చైతన్యం వల్ల ఈ ప్రాంతంలో జీడి మొక్కలు నాటారు. శాస్త్రవేత్తల సూచనలతో మొక్కలు నాటడం, భౌగోళిక పరిస్థితులు వల్ల అధిక దిగుబడి సాధ్యమవుతోంది. తక్కువ విస్తీర్ణంలో సాగుతో వేలాది కిలోల దిగుబడి సాధిస్తున్నారు. గత మూడేళ్లలో ఇక్కడ జీడి సాగు విపరీతంగా పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *