Health

నిశ్శబ్దంగా ప్రాణాలు హరించే హార్ట్ ఎటాక్ లక్షణాలు మరియు నివారించే చిట్కాలు ఇవే

నిశ్శబ్దంగా ప్రాణాలు హరించే హార్ట్ ఎటాక్ లక్షణాలు మరియు నివారించే చిట్కాలు ఇవే

ఈ రోజులల్లో కామన్ గా రజో వింటూ ఉంటాము లేదా న్యూస్ చూడతమో వినతమో జరుగుతుంది గుండె నొప్పితో లేదా గుండె జబ్బుతో మరణించారని, చాలా మంది సెలబ్రిటీలు లేదా పొలిటికల్ లీడర్స్ గుండె నొప్పితోనో లేదే గుండె జబ్బుతోనో చనిపోతు ఉంటారు, అయితే మనం ఇది ఎలా వస్తుంది, లక్షణాలు ఏమిటి, ఎలా నివారించాలో తెలుసుకుందాము.

మీరు గమనించారో లేదో చాలా మందికి గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య సమయంలోనే ఎక్కువగా వస్తుంది. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సిజన్ అవసరమవుతుంది. అవసరానికి సరిపడ ఆక్సిజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. మరి అటువంటప్పుడు ఏంచేయాలి, అసలు గుండె జబ్బు నివారణకు ముందస్తు జాగ్రత్తగా ఏం చేయాలో చూద్దాం.

రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి. ఏదో ఒక వ్యాయామం మాత్రం తప్పనిసరి.

రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి)కి మించి ఉప్పు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోవద్దు. అది కూరలు, ఇతర ఆహార పదార్థాల్లో వేసినదానితో సహా కాలిక్యులేట్ చేసుకోవాలి.

రోజూ ఏదో ఒక ఫ్రూట్ ను తప్పనిసరిగా తింటూ ఉండండి.

ఆల్కహాల్, పొగతాగే అలవాటు ఉంటే క్రమంగా తగ్గించుకుంటూ పూర్తిగా మానేయండి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి.

కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

మీ ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండేలా చూసుకోండి.

షుగర్ ఉన్న వారికి(ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక హార్ట్ స్ట్రోక్ రాబోతోందనే సంకేతాలు ఇలా ఉంటాయి..

హార్ట్ ఎటాక్ కు ముందు మనకు కన్పించే లక్షణాలు:

జలుబు, ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా, అవి ఓ పట్టాన తగ్గకున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి. దీంతోపాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.

ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు. వైద్యున్ని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి.

హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.

విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికలుగా పనిచేస్తాయి.

మత్తు మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలయ్యే ప్రమాదముంది.కంటి చివర్లలో కురుపుల వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ లక్షణాలు కావొచ్చు.

ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణమవకపోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలుగానే అనుమానించి వైద్యుణ్ణి సంప్రదించాలి.

శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి. ఒక్కోసారి దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించొచ్చు.

కాళ్లు, పాదాలు, మడిమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాలి.

గుండె సంబంధ సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా అసాధారణ రీతిలో ఉంటుంది. కాబట్టి హార్ట్ బీట్‌ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధారణ బీట్ కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *