Education

గూగుల్ UPI యాప్‌ తో 100000 వరకు క్యాష్ బ్యాక్ .ఎలా అంటే?

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ తన మొబైల్‌ పేమెంట్‌ సర్వీసును భారత్‌లో లాంచ్‌ చేసింది. తేజ్‌ అనే పేరు మీద ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ ఐడీ, క్యూఆర్‌ కోడ్‌, ఫోన్‌ నెంబర్‌, బ్యాంకు అకౌంట్ల ద్వారా యూజర్లు తమ నగదును ట్రాన్సఫర్‌ చేసుకునే వెసులుబాటును ఈ పేమెంట్‌ సర్వీసు కల్పిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు డివైజ్‌లకు గూగుల్‌ తేజ్‌ అందుబాటులో ఉంటుంది. ఈ అప్లికేషన్‌ గురించి మరింత సమాచారం అందించడానికి గూగుల్‌ ఢిల్లీలో ఓ ఈవెంట్‌ నిర్వహించబోతుంది. ఈ ఈవెంట్‌లో అధికారికంగా అరుణ్‌జైట్లీ ఈ యాప్‌ను ఆవిష్కరించనున్నారు.ఈ యాప్‌ను ప్రమోట్‌ చేసేందుకు రిఫరెల్‌ రివార్డులను కూడా గూగుల్‌ ప్రకటించింది. ఈ యాప్‌ను యూజర్‌ తమ స్నేహితునికి రిఫర్‌ చేసి, దానిలో సైన్‌ ఇన్‌ అయి, పేమెంట్‌చేస్తే, మీరు, మీ ఫ్రెండ్‌ రూ.51 రివార్డు పొందనున్నారు. ఇలా ఎక్కువ మందికి రిఫర్‌ చేస్తే, గరిష్టంగా రూ.9000 వరకు రివార్డును సొంతం చేసుకోవచ్చు.2018 ఏప్రిల్‌ 1 వరకు ఈ రిఫరెల్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అన్ని దేశీయ దిగ్గజ బ్యాంకులతో పాటు, డామినోస్‌, రెడ్‌బస్‌, పీవీఆర్‌లను తమ పేమెంట్‌ పార్టనర్లుగా గూగుల్‌ చేర్చుకుంది.అదనంగా బిజినెస్‌ యూజర్ల కోసం కూడా ఈ యాప్‌ను ప్రారంభించింది. వ్యాపార యజమానులు, దుకాణదారులు తమ కరెంట్‌ అకౌంట్‌తో తేజ్‌ యాప్‌ను వాడుతూ ఎలాంటి ఫీజులు లేకుండా నేటి నుంచి డిజిటల్‌ పేమెంట్లను అంగీకరించడం ప్రారంభించవచ్చని గూగుల్‌ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
1) గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి గూగుల్‌ తేజ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.(యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
2)ఇది ప్రారంభించడానికి భాషను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. హిందీ, బెంగాళి, గుజరాతీ, కన్నడ, వంటి భాషలకు ఈ యాప్‌ సహకరిస్తోంది.
.3)బ్యాంకు అకౌంట్‌తో లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌ను నమోదుచేసుకోవాలి
4)అలర్ట్‌లు, నోటిఫికేషన్‌, వెరిఫికేషన్‌లు పొందడానికి గూగుల్‌ అకౌంట్‌ను ఎంపికచేసుకోవాలి
5)ఇన్‌-యాప్‌ లాక్‌ను గూగుల్‌ తేజ్‌ సపోర్టు చేస్తుంది. కొత్త లాక్‌ను కూడా గూగుల్‌ తేజ్‌ కోసం క్రియేట్‌ చేసుకోవచ్చు
6)యూపీఐ ద్వారా, ఎంపికచేసిన బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌తో పేమెంట్‌ చేసుకోవాలంటే హోమ్‌ స్క్రీన్‌ వెళ్లాల్సి ఉంటుంది
7)యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ వంటి వాటితో గూగుల్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకునూ ఇది సపోర్టు చేస్తుంది.
8)మీ అకౌంట్‌ నెంబర్‌ను లింక్‌చేసుకోవచ్చు. దీని కోసం అకౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటి బేసిక్‌ బ్యాంకు వివరాలు అందజేయాలి.9)నగదు ఆధారిత లావాదేవీలకు అప్లికేషన్‌లోనే ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటుచేశారు. నగదు ఆధారిత లావాదేవీల చరిత్రను యూజర్లు చూసుకోవచ్చు. అన్ని రకాల లావాదేవీలను దీనిలో చెక్‌ చేసుకోవచ్చు.
10)ఈ రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద ఈ యాప్‌ను మీ స్నేహితులకు రిఫర్ చేసి, వారిని ఉపయోగించుకునేలా చేసినట్లయితే మీతో పాటు మీ స్నేహితులకు రూ.51 రివార్డ్ లభిస్తుంది.
12)తేజ్ యాప్ ఓపెన్ చేసి ఆఫర్ ఓపెన్ చేయగానే మీకు 1 లక్ష డ్రా కనిపిస్తుంది ….మీరు చేయవాల్సింది ఏమిటి అంటే 500 రూపాయలు మీ తేజ్ యాప్ ఉన్న ఫ్రెండ్ కి పంపాలి ,అలా మీకు స్క్రాచ్ కార్డ్ లబిస్తుంది లక్కీ డ్రా తేదీలు మీకు Rewards ఆప్షన్ లో కనిపిస్తుంది ఇలా రూ.100000 వరకు రివార్డు గెలుచుకునే వీలుంటుంది.
13)అలాగే 50 రూపాయలు మీ ఫ్రెండ్ పంపితే మీకు 1 స్క్రాచ్ కార్డ్ లబిస్తుంది.50 రూపాయలు 5 గురికి పంపిస్తే  మీకు 5 స్క్రాచ్ కార్డ్లు వస్తాయి,,,,,1000 రూపాయల వరకు మీకు గెలుచుకునే  అవకాశం ఉంది …వారం లో మీకు 5 5 స్క్రాచ్ కార్డ్లు మాత్రమే లభిస్తాయి
14)క్యాష్ బ్యాక్ నేరుగా మీ బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *