HealthViral

కొత్తిమీర ఆకుతో ఇలా చేస్తే ఒక్క నెలలో 10 కిలోల బరువు తగ్గొచ్చు

కొత్తిమీర ఆకుతో ఇలా చేస్తే ఒక్క నెలలో 10 కిలోల బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలని అనుకున్నప్పుడు అందరూ డైటింగ్ చేయమని,వాకింగ్ వంటి వ్యాయామాలు చేయమని ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇది అంత సులువైన విషయం కాదు. చాలా కష్టపడాలి. కొంతమంది డైటింగ్ చేసి బరువును తగ్గించుకుంటారు. అది తాత్కాలికమే. ఎందుకంటే ఎక్కువ రోజులు నోరు కట్టేసుకుని ఉండలేం. అలాగే ఇష్టమైన వాటిని చూస్తూ ఉండలేం. ఇలా డైటింగ్ చేయటం వలన తినాలనే కోరిక ఎక్కువ అయ్యిపోతుంది. తినేస్తూ ఉంటాం. మరల బరువు పెరగటం ప్రారంభం అవుతుంది. అప్పటివరకు చేసిన డైటింగ్ అంతా వెస్ట్ అయ్యిపోతుంది. ఇక వ్యాయామం విషయానికి వస్తే వ్యాయామం చేసి కూడా బరువు తగ్గించుకోవచ్చు. అయితే వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ప్రతి రోజు కనీసం అరగంట వ్యాయామం చేయాలి.

ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని రోజుకి మూడు సార్లు త్రాగితే నెలలో 8 కిలోల వరకు బరువును తగ్గించుకోవచ్చు. ఈ డ్రింక్ బరువుని తగ్గించటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ డ్రింక్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ డ్రింక్ ని ఉదయం పరకడుపున తీసుకోవాలి. ఈ డ్రింక్ కి కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం. చిన్న కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్టను శుభ్రంగా కడగాలి. వేళ్ళతో సహా ఉపయోగిస్తే జీర్ణ వ్యవస్థను ఆక్టివ్ చేసి బరువును తొందరగా తగ్గించటంలో సహాయపడుతుంది. రెండు వెలుల్లి రెబ్బలు. వెల్లుల్లి మన ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. మూడోవది దాల్చినచెక్క. ఇది మన శరీరంలో మెటబాలిజం రేటును పెంచి అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. నాల్గొవది 10 కరివేపాకు ఆకులు. ఇవి మన శరీరంలో అధికంగా పెరిగిన కొవ్వును తగ్గిస్తాయి. ఐదోవది అర నిమ్మచెక్క. నిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గించటంలో సహాయపడతాయి.

ఒక మిక్సీ జార్ తీసుకోని కొత్తిమీర,వెల్లుల్లి రెబ్బలు,చిన్న దాల్చిన చెక్క ముక్క,కరివేపాకు,నిమ్మరసం వేసి గోరువెచ్చని నీటిని వేస్తూ మొత్తం జ్యుస్ లా మిక్సీ చేసుకోవాలి. ఈ జ్యుస్ ని గ్లాస్ లోకి తీసుకోని రుచి కోసం తేనే కలపవచ్చు. ఈ డ్రింక్ ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకున్న అరగంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఈ అరగంట సమయంలో వ్యాయామం చేస్తే చాలా మంచిది. మధ్యాహ్నం భోజనం అయ్యాక గంట తర్వాత మరోసారి ఈ జ్యుస్ త్రాగాలి. రాత్రి డిన్నర్ అయ్యాక గంట తర్వాత ఈ జ్యుస్ త్రాగాలి. ఈ డ్రింక్ త్రాగిన రెండు గంటల తర్వాత మాత్రమే పడుకోవాలి.

ఈ జ్యుస్ లో ఉపయోగించిన పదార్ధాలు అన్ని చెడు కొలస్ట్రాల్ ని తగ్గించటానికి,పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే పది రోజుల్లోనే తేడా గమనిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *