HealthLifestyle

చలికాలంలోనే ఎందుకు జాగింగ్ చేయాలి? పరిశోధనలో ఆసక్తికర విషయాలు !

చలికాలంలోనే ఎందుకు జాగింగ్ చేయాలి? పరిశోధనలో ఆసక్తికర విషయాలు !

చలికాలం ఈ పేరు చెబితే సహజంగా గుర్తొచ్చేది ఎముకలు కొరికే చలి, హిమపాతం, చలిమంటలు. కానీ చలికాలంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మరోఅంశమే జాగింగ్. చలికాలం వచ్చిందంటే చాలు.. వయసు భేదం లేకుండా, ఎవరూ చెప్పకపోయినా చిన్నా పెద్దా, స్త్రీపురుషులనే భేదంలేకుండా చాలామంది జాగింగ్ చేస్తూ కనిపిస్తారు. కానీ చలికాలంలోనే ఎందుకు జాగింగ్ చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం శూన్యం. చలికాలంలో ఎందుకు జాగింగ్ చేస్తారో మీకు కూడా తెలియదా ? అయితే ఈ తెలుసుకోండి.

చలికాలంలో జాగింగ్ ఇందుకే చేయాలి.. ప్రయోజనాలు ఇవే..

1. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయస్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. కావున వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు.
2. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి హృదయస్పందన రేటు దాదాపు 6 శాతం తగ్గుతుంది. దీంతో అలసట చాలావరకు తక్కువగా ఉంటుంది.
3. గుండె మరియు రక్తనాళముల వ్యవస్త సమస్యలతో బాధపడుతున్నవ్యక్తులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పరిగెత్తడం ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి వారికి చలికాలం చక్కటి వాతావరణం.
4.చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తులకు తక్కువ శక్తి కూడా సరిపోతుంది.
5. చలికాలంలో రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత తక్కువ నమోదవడం వలన వ్యక్తులు పరిగెత్తాలే మానసికంగ సిద్ధమవుతారు.
6. గుండె నుంచి శరీర అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. కావున శరీర ఉష్ణోగ్రత జాగింగ్ సమయంలో పెరుగుతుంది.
7. దాదాపు 40 నిమిషాలు పరిగెత్తే వ్యక్తి నుంచి దాదాపు 1.3 లీటర్ల చెమట కారుతుంది. కానీ చల్లనివాతావరణంలో పరిగెత్తడం వలన డీహైడ్రేషన్ చాలాతక్కువగా జరుగుతుంది. కావునా శక్తి కూడా చాలా తక్కువగా అవసరమవుతుంది.

ఇంకో ముఖ్యవిషయంలో ఏమిటంటే.. సూర్యడి వెలుగు ఉన్న సమయంలో జాగింగ్ చేయడం చాలా మంచిది. కానీ ఇలా చేయడం వలన ఎక్కువ మొత్తంలో శక్తి అవసరమవుతుంది. కావునా చలికాలంలో జాగింగ్ చేయడం ఉత్తమం అని పరిశోధన నిర్వహించిన ప్రొఫెసర్ జాన్ బ్రేవర్ తెలిపారు. ఆసక్తికరమైన ఈ పరిశోధనను లండన్‌లోని సెయింట్ మేరీస్ యూనివర్సిటీ బృందం చేపట్టడంతో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కావునా చలికాలంలో పరిగెత్తాలనుకునేవారి నిర్ణయం మంచిదేనని పరిశోధనలు తెలుపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *