HealthNewsUseful

మీ పెదవులు అందమైన, ఆకర్షణీయమైన గులాబీ రంగులోకి మారేందుకు ఇలా చేయాలి

మీ పెదవులు అందమైన, ఆకర్షణీయమైన గులాబీ రంగులోకి మారేందుకు ఇలా చేయాలి

మీ పెదవులు అందమైన, ఆకర్షణీయమైన గులాబీ రంగులోకి మారేందుకు ఇలా చేయాలి
పాల క్రీం మరియు కుంకుమ: 1 టేబుల్ స్పూన్ పాలు, 1 టేబుల్ స్పూన్ పాల క్రీం, కొంచెం కుంకుమను కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుని మీ పెదవులకు రాసుకోవాలి. తర్వాత ఒక కాటన్ బాల్ తో తుడుచుకోవాలి.

పాలు మరియు గులాబీ రేకులు: 1 టేబుల్ స్పూన్ పాలు అలాగే కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని పాలల్లో బాగా గులాబీ రేకుల్ని క్రష్ చేయాలి. తర్వాత దీనిని ఫ్రిజ్ లో చల్లగా అయ్యేంత వరుకూ ఉంచాలి. తర్వాత దానిని తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ పవ్డర్ వేసి పేస్ట్ గా చేసుకుని ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవాలి. 10- 15 నిముషాలు అలాగే ఉంచుకుని పొడి దూదితో తుడుచుకోవాలి. దీనివల్ల మీ పెదవులు గులాబీ రంగుతో, మృదువుగా, ప్రకాశవంతంగా మారతాయి.
అలాగే పాలల్లో గులాబీ రేకుల్ని బాగా మిక్స్ చేసి తర్వాత కొంతసేపు ఉంచి తర్వాత ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవచ్చు. అలాగే పాలకు బదులు మీరు గ్లిసరిన్ కూడా వాడవచ్చు.

బీట్రూట్ తో పాల క్రీం: బీట్రూట్ తో పాల క్రీం ను కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. లేద దానిమ్మను కూడా క్రీం తో కలిపి మిశ్రమం గా చేసి పెదవులకు వేసుకుంటే అది చక్కటి మృదువైన పెదవుల్ని ఇస్తుంది. పగిలిన పెదవులు సైతం మారి చక్కటి గులాబీ రంగు పెదవులుగా మారతాయి.

తేనె మరియు నిమ్మ: తేనె చక్కటి అన్ని రకాల చర్మాలకూ పడే పదార్ధం. దీనిని మీ పెదవుల సమ్రక్షణకు కూడా వాడవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ తేనె అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. తర్వాత మీ పెదవులకు వేసుకోవాలి. కొంత సమయం అయ్యక చల్లటి నీటితో కడుగుకోవాలి. తర్వాత మీ జీవం లేని పాలిన పెదాలు గులాబీ రంగులోనికి మారటం గుర్తించవచ్చు.

టొమాటో మరియు పాల క్రీం: మిల్క్ క్రీం లో టొమాటో పేస్ట్ ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకోవాలి. గులాబీ రంగు పెదవుల పొందాలంటే నెయ్యి లేదా వెన్న లేదా కుంకుమలు సహజ సిధ్ధమైన చికిత్సా మార్గాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *