HealthViral

ఈ ఆకు తినడం వాళ్ళ వచ్చే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు . కొన్ని మూలికల గురించి చదువుతూంటే భగవంతుడు ఎంత దయామయుడు అనిపిస్తుంది . అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని , ఔషధాలను అతి దగ్గరగా , సులువుగా , చవకగా ఉంచినందుకు . ప్రకృతిని నాశనం చేస్తూన్న మనిషికి తనని తాను నాశనం చేసుకుంటున్నాడన్న స్పృహ ఎప్పుడు కలుగుతుందో అనిపిస్తుంది . ఆరోగ్యం లేని ధనం , జీవితం , ఆయుష్షు ఎవరికి, ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి .

మన మొక్క విషయానికి వస్తే ,దీన్ని పునర్నవ అని కూడా అంటారు . ఆయుర్వేద మందుల్లో anti inflammatory గా , anti oedema (ఒంట్లో నీరు చేరటం ) ముందుగా వాడే పునర్నవాసవం , రక్తాన్ని వృద్ది పరచటానికి వాడే పునర్నవ మండూరం తయారు చేసేది ఈ మొక్కతోనే .

వర్షాభూ అని కూడా అంటారు . వర్షా కాలం లో మొలిచేది కాబట్టి .ఇంగ్లీష్ లో boerhavia diffusa .నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు.తెలుపు , ఎరుపు , నలుపు. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు .వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.

తెల్ల గలిజేరు వేడి చేసి , కఫము ,దగ్గు ,విషము ,హృద్రోగాలను ,పాండు రోగాలు , శరీరానికి కలిగే వాపులు , వాత వ్యాధులు , కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది . లివర్ వాపు ని , గుండె బలహీనత వల్ల వఛ్చిన వాపుని పోగొడుతుంది . కిడ్నీ లను బాగు చేసి సక్రమం గా పని చేసేలా చేస్తుంది . బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి , పాండు రోగము , శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి , వాతము , కఫము , ఉబ్బు పోగొడుతుంది .

నెల రోజులు తింటే కుష్ఠుని కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది . ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి , కంటి చూపు మెరుగు పడుతుంది . ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది . ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం , సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి . అలా మూడు రోజులు తినాలి .

ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి . గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి , వాతం నొప్పులున్న చోట , కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి . నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు . గలిజేరు ఆకు రసం తీసి సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి ఉంచాలి . రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగితే గుండె దడ , గుండె బలహీనత తగ్గుతాయంటారు

శరీరాన్ని detoxify చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది . శరీరం లో యూరియా లెవెల్స్ ని తగ్గిస్తుంది . diuretic గా పని చేస్తుంది . గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది .

ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది . నల్ల గలిజేరు కారం , చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది . ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె .

పప్పులో కలిపి వండుకుంటారు , ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి లో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు . ఆకుల తో కషాయం చేసి తాగుతారు . ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది .

తెల్ల గలిజేరు వేరు , ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది.

తెల్లగలిజేరు వేరు , నీరు , పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది .

ఈ ఆకు కూరని అతిగా తినకూడదు . తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి .diabetes , అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికం గా తింటూ ఈ ఆకు కూరని మితం గా తినాలి . ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాడాలి . lactating తల్లులు , గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలం లో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది . చాలా త్వరగా కిడ్నీ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *