Lifestyle

గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా…..

egg-is-for-health

పాలు ,గుడ్లు శరీర ఆరోగ్యానికే కాకుండా శిరోజాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ రెండూ ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతాయో,జుట్టు మీద కుడా అంతే ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడడం కన్నా ఇంట్లో లభించే వస్తువలతోనే జుట్టును నిగనిగలాడుతూ మెత్తగా, అందంగా చేసుకోవచ్చు.


గుడ్డుకి చిన్న రంధ్రం  పెట్టి తెల్ల సొనను వేరు చేసుకోవాలి. దీనికి కొన్ని పాలను కలిపి బాగా గిలకొట్టాలి. పాలు,తెల్ల సొన బాగా కలిసిన తరువాత ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్,చిటికెడు చక్కెర జత చేసి చక్కెర కరిగేంత వరకు కలపాలి. ముందుగా జుట్టుని షాంపూ తో శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకుని అనంతరం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంఛి మొత్తం పట్టించాలి. ఇప్పుడు దువ్వెనతో జుట్టంతా కలిసేలా సున్నితంగా దువ్వాలి. ఏదో ఒకసారి దువ్వేసి వదిలిపెట్టుకుండా కనీసం ఏడు నుండి ఎనిమిది నిముషాలు పాటు జుట్టును దువ్వుకోవాలి. జుట్టు  ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఆయితే ఆలివ్ ఆయిల్ని కలిపేటప్పుడు ఎక్కువ కలపకూడదు. ఆలివ్ ఆయిల్ కండీషనర్ గా పని చేస్తే  జుట్టుని చల్లగా ఉంచుతుంది. గుడ్డు,పాలు కలిపి మసాజ్ చేయడం వల్ల జుట్టు కొద్దిగా వాసన వచ్చే అవకాశం ఉంది. ఇది ఇష్టపడని వాళ్ళు తల స్నానానికి ముందు పాలను జుట్టుకు పట్టించి ఎండిన తరువాత షాంపూ తల స్నానం చేసినా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *