HealthLifestyle

చేతితో భోజనము చేయుట వలన కలుగు లాభములు…

చేతితో భోజనము చేయుట వలన కలుగు లాభములు…

డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.తిండేదైనా ఫోర్క్ పక్కా అయి
హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.

ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం.

ఇది చదివాక ఎక్కడున్నా మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేయండి.

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు: ( As Per Science)

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.

3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.

7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.

8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా…

చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.

బొటనవేలు : అగ్నితత్వం

చూపుడు వేలు : వాయుతత్వం

మధ్యవేలు : ఆకాశం

ఉంగరపు వేలు : భూమి

చిటికిన వేలు : జలతత్వం.

ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *