పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ హైదరాబాద్ సర్కిల్‌లో స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మెయిల్ మోటార్ సర్వీస్‌లోని డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25 నుంచి రూ.30 వేలు వేతనం చెల్లిస్తారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అందజేసే ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.

స్టాప్ కారు డ్రైవర్: 13
విద్యార్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. హెవీ/ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం నడపడంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజమ్‌లో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వారికి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులనూ పూర్తిచేసి The Manager, Mail Motor Services, Koti, Hyderabad, Telangana- 500 095 చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, డ్రైవింగ్ అనుభవం ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేస్తారు. తర్వాత వీరికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లెక్కకు మించి దరఖాస్తులు వస్తే రాత పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: నవంబరు 30

 

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *