కాసులు కురిపించబోతున్న వాట్సాప్ …

కాసులు కురిపించబోతున్న వాట్సాప్ …

ఎంతసేపు వాట్సాప్ లో  ఛాటింగ్ లు.. వీడియోలు.. ఫొటోల షేరింగే కాదు.. కాస్త ఉపయోగపడే పనిచేయరా బాబు.. అని ఇంట్లో పెద్దవాళ్లు చాలామంది యూత్ ను తిడుతుంటారు. పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు యూత్ ఇప్పుడు వాట్సాప్ కే అతుక్కుపోతున్నారు. వాట్సాప్ యూత్ కే పరిమితం కాలేదు. పెద్దవాళ్లు కూడా చాలామంది వాట్సాప్ వాడేస్తున్నారు. ఈజీగా మెస్సేజ్ లు పంపించేస్తున్నారు.

అయితే.. ఇన్ని రోజులు వాట్సాప్ అంటే  ఓ టైంపాస్ యాప్ అని చాలా మంది ఫీలింగ్. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ గా మారబోతోంది. టైం పాస్ ముచ్చట్లే కాదు.. అక్కరకొచ్చే పనులు కూడా చేస్తానంటోంది వాట్సాప్. ఇంతకీ ఏంటనుకుంటున్నారా..? వాట్సాప్ లో త్వరలో మనీ ట్రాన్స్ ఫర్ ఫీచర్ రాబోతోంది. “వాట్సాప్ పే” పేరుతో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది సంస్థ.

ఇప్పటికే వాట్సాప్ పే డిజైన్ కంప్లీట్ అయ్యిందట. ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నెలరోజుల్లో అందరి వాట్సాప్ లో పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్ పే కోసం కొత్తగా వేరే అప్లికేషన్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది సదరు సంస్థ. వాట్సాప్ పే లాంఛ్ అయ్యాక.. ఉన్న అప్లికేషన్ ను అప్డేట్ చేసుకుంటే చాలు.

 

 

 

ప్రస్తుతం వాట్సాప్ లో కనిపిస్తున్న అటాచ్ మెంట్ బటన్ క్లిక్ చేయగానే అందులో రూపీ సింబల్ తో పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి.. ఎవరికీ పంపాలో సెలక్ట్ చేసుకుని యూపీఐ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనీ ట్రాన్స్ ఫర్ అయిపోతుంది.  దీనికోసం ఇప్పటికే SBI, HDFC,ICICI బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం చేసుకుందంట.

ఇలాంటి ప్రయోగం చైనాలో కూడా సక్సెస్ అయ్యింది. చైనాలో చాటింగ్ యాప్ అయిన “వీ చాట్” లో ఇలా మనీ ట్రాన్సఫర్ ఆప్షన్ గతంలోనే పెట్టారంట. ఇది యాడ్ చేశాక యూజర్స్ సంఖ్య చాలావరకు పెరిగిందని ఆ సంస్థ ప్రకటించింది. కాబట్టి.. ఇప్పటికే ఫుల్ వాడకంలో ఉన్నవాట్సాప్.. కొత్త ఆప్షన్ వచ్చాక మరింత దూసుకెళ్తే ఛాన్స్ ఉంది.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *