శ్రీదేవి మరణంపై కొత్త ప్రశ్నలు..కుట్ర లేదు..! స్ట్రోకూ కాదు…!

కుట్ర లేదు..! స్ట్రోకూ కాదు…! శ్రీదేవి మరణంపై కొత్త ప్రశ్నలు..!

మొదలయ్యాయి… శ్రీదేవి మరణానికి సంబంధించి కొత్త కొత్త ప్రశ్నలు, సందేహాలతో కథనాలు మొదలయ్యాయి… శ్రీదేవి బోనీకపూర్ కొన్ని నిజాలేమిటో వెల్లడించాల్సిన స్థితి ఏర్పడింది… అలాగే దుబాయ్ ఆరోగ్యశాఖ ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టు కొత్త సందేహాలను, ప్రశ్నార్థకాలను ముందుపెడుతున్నది… వెరసి శ్రీదేవి మరణం ఓ ప్రశ్నగా మారుతున్నది… పలు మీడియా సంస్థలు రాస్తున్న కథనాల ప్రకారం… యూఏఈ ఆరోగ్యశాఖ ఆమె మరణం వెనుక ఏ నేరపూరిత ఉద్దేశమూ లేదని ప్రకటించింది… గంటల తరబడీ బోనీకపూర్‌ను ప్రశ్నించి, వాంగ్మూలాన్ని పోలీసు శాఖ రికార్డు చేసింది… నలుగురు పోలీసు అధికారుల సమక్షంలో ఈ విచారణ సాగింది… ఆమె మరణాన్ని మొదట చూసింది, రిపోర్ట్ చేసిందీ తనే కాబట్టి…! ఈ విచారణ కోసమేనా ఆమె భౌతికదేహం అప్పగింతలో ఇంత జాప్యం జరిగింది..? సదరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వైరల్ అవుతున్నది… ఎందుకంటే..? అందులో గుండెపోటు ప్రస్తావనే లేదు… ప్రమాదవశాత్తూ మునక కారణంగా మరణించినట్టు పేర్కొన్నారు… పైగా ఆమె రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా ఉన్నాయి… సరే,

ఆమె వెళ్లింది ఫంక్షన్‌కే కాబట్టి కొంత తీసుకుని ఉండవచ్చు… కానీ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునగడం ఏమిటి..? ఊపిరాడని స్థితికి చేరుకోవడం ఏమిటి..? ఆమె స్నానం చేస్తుండగా, స్ట్రోక్ వచ్చి, అలాగే అందులోనే తలమునిగి, ఊపిరాడక మరణించిందా..? అంత ఆల్ ఆఫ్ సడెన్ దేహం అచేతనమయ్యేంతగా… మరీ అంత మాసివ్ స్ట్రోక్ వచ్చే ముందస్తు లక్షణాలు గానీ, అనారోగ్య చరిత్ర గానీ ఆమెకు లేదు..? పైగా రిపోర్టులో అసలు గుండెపోటు ప్రస్తావనే లేదు… అదిసరే… అంత రాత్రివేళ బాత్‌టబ్‌లోె నీళ్లు ఎందుకు నింపినట్టు..? ఆ రాత్రి వేళ స్నానమేంటి..? ఒక ప్రశ్నకు మరో ప్రశ్నకూ లంకె కుదరక కొత్త ప్రశ్నలు… ఓహ్…

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *