DevotionalLifestyleUsefulViral

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?

సంపదలకు అధినేత్రి శ్రీ మ‌హాల‌క్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది.

అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు, హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇంటికి సిరి ఇల్లాలు ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే ల‌క్ష్మి వెళ్లిపోతుంది. అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం, లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. మనకున్న దానిలో దానం చేయాలి ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *